Ice Cream Taster: ఐస్‌క్రీమ్ తిని టేస్ట్ చెప్పడానికి ఇప్పటికీ కోట్లను తీసుకుంటున్న వృద్ధుడు.. టేస్టీ‌‌బడ్స్‌కు మిలియన్ డాలర్ల భీమా..

|

Sep 04, 2021 | 11:55 AM

Ice Cream Taster: తిండి, బట్టలు, ఉండడానికి ఇల్లు ఇవి మనిషి ప్రాధమిక అవసరాలు.. వీటిని తీర్చుకోవడానికి మనిషి కష్టపడతాడు. డబ్బులను సంపాదిస్తాడు. మొత్తానికి కొంతమంది తినడం కోసం డబ్బులు..

Ice Cream Taster: ఐస్‌క్రీమ్ తిని టేస్ట్ చెప్పడానికి ఇప్పటికీ కోట్లను తీసుకుంటున్న వృద్ధుడు.. టేస్టీ‌‌బడ్స్‌కు మిలియన్ డాలర్ల   భీమా..
Ice Cream Taster
Follow us on

Ice Cream Taster: తిండి, బట్టలు, ఉండడానికి ఇల్లు ఇవి మనిషి ప్రాధమిక అవసరాలు.. వీటిని తీర్చుకోవడానికి మనిషి కష్టపడతాడు. డబ్బులను సంపాదిస్తాడు. మొత్తానికి కొంతమంది తినడం కోసం డబ్బులు సంపాదించుకుంటే.. మరికొందరు డబ్బులు సంపాదించడం కోసం తింటారు. కొన్ని ఐస్ క్రీమ్స్ , బిస్కెట్స్, చాకోలెట్స్ , వ్యాపార సంస్థలు తాము తయారు చేసే ఆహారవస్తువులను రుచి చూసి.. వాటి ఫీడ్ బ్యాక్ ను బట్టి వాటిల్లో మార్పులు చేర్పులు జరిపి.. తమ ఆహారపదార్ధాలను మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. సక్సెస్ అందుకుంటుంది. అయితే ఇలా కొత్తకొత్త ఆహారపదార్ధాలను రుచి చూడడనికి సదరు వ్యక్తికీ లక్షల్లో జీతం ఇచ్చి నియమించుకుంటాయి కొన్ని ఆహారపదార్ధాలను తయారు చేసే సంస్థలు.  ఇక కరోనా వచ్చిన తర్వాత అనేక మంది ఉద్యోగాలు పోగొట్టుకుని అనేక ఇబ్బందులు పడుతుంటే.. ఓ వ్యక్తి మాత్రం హాయిగా తనకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తింటూ.. కోట్లల్లో సంపాదిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

వెనిల్లా, చాకోలెట్, డ్రై నట్స్ , ప్లయిన్ , సీతాఫల్, జాక్ ఫ్రూట్, కోకోనట్, ఇలా నిత్యం రకరకాల రుచులలో ఐస్ క్రీమ్స్ దొరుకుతున్నాయి. ఈ ఐస్ క్రీమ్ ప్రపంచ వ్యాప్తంగా అనేక బ్రాండ్స్ లో రకరకాల రుచుల్లో మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అయితే ఇన్ని ర‌కాల ఐస్ క్రీమ్‌ల‌ను మార్కెట్ లోకి రావాలంటే క‌చ్చితంగా ఒక వ్య‌క్తి తిని.. అతను ఒకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. అప్పుడే ఆ ఐస్ క్రీములు బయ‌ట‌కు వ‌స్తాయి.

అమెరికాకు  చెందిన జాన్ హారిసన్..  ఐస్ క్రీమ్ లో ఈ రుచి ఫలానా బ్రాండ్ లో బాగుంది అంటే చాలు.. ఆ ఐస్ క్రీమ్ కు ఓ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది.  ఐస్ క్రీమ్ బాగుంది అని సర్టిఫికెట్ ఇచ్చినట్లే భావిస్తారు వినియోగదారులు. అతని స్పెషాలిటీ ఏంటంటే జాన్ హరీసన్ ఐస్ క్రీమ్ రుచి ని కరెక్ట్ గా చెబుతాడు. అందుకనే ఎక్కువ ఐస్ క్రీమ్ కంపెనీలు తమ ఐస్ క్రీమ్ లను మార్కెట్ లోకి రిలీజ్ చేయడానికి ముందే జాన్ హారిసన్ కు రుచి చూపిస్తాయి. హారిసన్ ఐస్ క్రీమ్ తిని.. వాటిల్లో తేడా ఏదైనా ఉంటె.. ఎలా క్లియర్ చేయాలో చెప్పి.. సమస్యను సాల్వ్ చేయిస్తారట. తనకు ఉన్న టేస్టీ బడ్స్.. ఐస్ క్రీమ్ ల తయారీతో ఐస్ క్రీమ్ కంపెనీలకు తగిన సలహాలు సూచనలు ఇస్తారు. ఇలా ఐస్ క్రీమ్ లు తిని రుచి చెప్పడానికి సమస్యను పరిష్కరించడానికి హారిసన్ అక్షరాలా కోటి రూపాయలను జీతంగా తీసుకుంటున్నారు. వృద్దుడైనా రుచి చూసి ఐస్ క్రీమ్ మార్కెట్ లో నిలబడుతుందా లేదా చెప్పడంలో దిట్టఅట. దీంతో  ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమ‌స్ బ్రాండ్ల ఐస్ క్రీమ్‌ యాజమాన్యాలు కూడా తమ ప్రోడక్ట్ ను  మ‌న‌కు మార్కెట్లో అందుబాటులోకి తీసుకుని వచ్చే ముందు జాన్ హారిసన్ కు కోట్ల రూపాయలు ఇచ్చి మరీ రుచి చూపిస్తారట.

అతను రోజూ సగటున అరవై ఐస్ క్రీమ్ రుచులను రుచి చూశాడు.  హారిసన్ ఐస్ క్రీం తినడు, బదులుగా దానిని ఉమ్మివేస్తాడు. అంతేకాదు వందకు పైగా ప్రత్యేకమైన ఐస్ క్రీమ్ రుచులను సృష్టించడంలో సహాయపడ్డాడు. జాన్  హారిసన్ ను “అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఐస్ క్రీం మనిషి” గా కూడా వర్ణించింది. హారిసన్ పై అనేక టెలివిజన్ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. 1997 లో, హారిసన్ కు అమెరికన్ టేస్టింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క మాస్టర్ టస్టర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ లభించింది. 1942 లో జన్మించిన హారిసన్  తండ్రుల కుటుంబం, అతని ముత్తాత వరకు, ఐస్ క్రీమ్ పరిశ్రమలో ఏదో ఒక విధంగా పాలుపంచుకున్నారు. దీంతో అతని చిన్నతనం నుంచి ఐస్ క్రీమ్ తో అనుబంధం ఏర్పడింది. ఇక   తన టేస్టీ బడ్స్ ను మిలియన్ డాలర్లకు బీమా చేయించుకున్నాడు. వృద్ధుడైన హారిసన్ ఇప్పటికీ తన టేస్టీ బడ్స్ ను కాపాడుకోవడానికి కొన్ని ఆహారపు అలవాట్లను ఫాలో అవుతూ ఉంటాడు.

Also Read:   తమ భవిష్యత్ తెలుసుకోవడానికి అక్కడ ఆశ్రమానికి వెళ్తే.. ఫుల్ బాటిల్ తాగాల్సిందే.. అప్పుడే స్వామిజీ జోస్యం చెబుతారు..