AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్దె ఇంట్లో నివసిస్తున్నారా? .. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!.. లేదంటే మీకే నష్టం!

ఉద్యోగాల కోసం పట్టణాలకు వలస వచ్చే చాలా మంది అద్దె ఇళ్లలో నివసిస్తుంటారు. ఇళ్లు రెంట్‌కు ఇచ్చినప్పుడు ఒకనర్స్‌ కొన్ని కండిషన్స్‌ పెడతారు. మనం వాటిని పాటించకపోతూ వాళ్లు రూల్స్‌ మాట్లాడుతారు. ఇల్లు ఖాళీ చేయమంటారు. అయితే ఇల్లు అద్దెకు ఇచ్చే వారిలాగే, అద్దెకు తీసుకునే వారికి కూడా కొన్ని చట్టపరమైన హక్కులు మన దేశంలో ఉన్నాయి. వీటి గురించి చాలా మందికి తెలియదు. కాబట్టి అద్దె ఇళ్లలో నివసించే వారు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటో చూద్దాం

అద్దె ఇంట్లో నివసిస్తున్నారా? .. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!.. లేదంటే మీకే నష్టం!
Tenant Rights India
Anand T
|

Updated on: Sep 19, 2025 | 9:53 PM

Share

మీరు అద్దె ఇంట్లో నివసిస్తున్నారా? అయితే మీరు వచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చాలా మంది, ఇంటి ఒనర్స్‌ వారి ఇంట్లో నివసిస్తున్న కుటుంబాన్ని రకరకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటారు. దీని కారణంగా, చాలా మంది వ్యక్తులు వారి వ్యక్తిగత జీవితాల్లో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, ఇంటి యజమానులు ఇతర కారణాల వల్ల కూడా సమస్యలను కలిగిస్తారు. ఈ సందర్భంలో, భారతదేశంలో ఇల్లు అద్దెకు తీసుకునే వారికి కూడా కొన్ని చట్టపరమైన హక్కులు ఉన్నాయి. అవి ఏంటనే విషయానికి వస్తే..

ఇంట్లోకి రావాలంటే అనుమతి తప్పనిసరి

మీరు ఎక్కడైనా ఇంటిని రెంట్‌కు తీసుకున్నా, లేదా ఒక రూమ్‌ను రెంట్‌కు తీసుకున్నా.. మీ ఓనర్‌ మీ అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించకూడదు.అది వారి సొంత ఇల్లు అయినప్పటికీ. మీ సరైన అనుమతి లేకుండా లేదా మీకు చెప్పకుండా వారు మీ ఇంట్లోకి ప్రవేశించకూడదు. అలా కాదని వాళ్లు మీ ఇంట్లోకి వస్తే అది చట్టవిరుద్ధమైన చర్యగా భావించాలి.

ప్రాపర్‌ రెంట్‌ అగ్రిమెంట్

మీరు ఒక ఇంట్లో 11 నెలలకు పైగా రెంట్‌కు ఉంటే.. మీరు ఖచ్చితంగా రెంట్‌ అగ్రిమెంట్‌ తీసుకోవాలి. మీ అగ్రిమెంట్‌ చట్టబద్ధంగా నమోదు చేయబడిన పత్రం అయి ఉండాలి. ఇంటి యజమాని మీకు సాదా కాగితంపై చేతితో రాసిన లేదా టైప్ చేసిన ఒప్పందాన్ని ఇస్తే, ఏదైనా సమస్య కారణంగా మీరు కోర్టుకు వెళితే అది చెల్లదు. కాబట్టి ఇది గుర్తించుకోండి

వెంటనే ఖాళీ చేయమనే హక్కు లేదు

మీకు, మీ ఓనర్‌కు మధ్య ఏవైనా విభేదాలు వచ్చి నప్పుడు.. మిమ్మల్ని రాత్రికి రాత్రే ఇళ్లు ఖాళీ చేయించే హక్కు మీ యజమానికి ఉండదు. మిమ్మల్ని ఖాళీ చేయించడానికి చట్టపరమైన ప్రక్రియ ఉండాలి. భారతీయ అద్దెదారుల రక్షణ చట్టం ప్రకారం, అద్దెదారుని ఖాళీ చేయమని అడిగే ముందు యజమాని అతనికి సరైన నోటీసు ఇవ్వాలి. మీ ఇంటి యజమాని మిమ్మల్ని వెంటనే ఖాళీ చేయమని అడిగితే, మీరు కోర్టును ఆశ్రయించవచ్చు. ఒప్పందం ఆధారంగా నిర్దిష్ట రోజుల కోసం అడగవచ్చు.

రెంట్‌ రిపిప్ట్స్‌ తప్పనిసరి

ఇంటి యజమానులు మీకు నెలవారీ అద్దె రసీదులను కచ్చితంగా అందించాలి. ఇది వారి హక్కు. అద్దె విషయంలో మీకు ఎప్పుడైన సమస్యలు వస్తే ఇది మీకు చట్టపరమైన రక్షణను ఇస్తుంది. అదనంగా, ఇంటి యజమాని భవన నిర్వహణ, మరమ్మతులకు మీ నుండి ఛార్జీ విధించకపోవచ్చు. ఇది మీ లీజులో స్పష్టంగా పేర్కొనబడాలి. అలాగే, కొన్ని రాష్ట్రాల్లో, అద్దె నియంత్రణ రక్షణ చట్టాలు ప్రకారం ఒక యజమాని తన ఇష్టారిత్యా రెంట్‌ను పెంచడానికి వీళ్లేదు.

మరిన్ని హ్యూమన్‌ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి