Fish Hunting on Roads in Telangana: రెండు, మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల వల్ల జనజీవన అస్తవ్యస్తం కాగా.. చెరువులు మత్తడి దూకుతున్నాయి. ఫలితంగా చెరువులో ఉండాల్సిన చేపలు రోడ్డు మీదకు కొట్టుకొచ్చాయి.
ఇంకోవైపు ఎంజాయ్ చేసేవారు తమదైన స్టైల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేసేస్తున్నారు. వర్షాలొస్తున్నాయి. చెరువులు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు సంద్రాలను తలపిస్తున్నాయి. దీంతో జనం రోడ్లపైకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. భారీ వర్షాలతో చెరువులు పొంగడంతో.. అందులో ఉన్న చేపలు కూడా రోడ్డుబాట పట్టాయి. భారీ చేపలు సైతం వరదలకు కొట్టుకురావడంతో.. తెలంగాణలోని పలుచోట్ల రోడ్లపైనే చేపలవేట సాగింది. నిర్మల్ జిల్లాలోని మంజులాపూర్ చెరువు పొంగింది. దీంతో నిర్మల్ పట్టణంలోని భైంసా రహదారిపైకి నీళ్లతోపాటు.. చేపలు కొట్టుకొచ్చాయి. జనం రోడ్లపైనుంచి పారుతున్న నీటిలో వలలు వేస్తూ చేపలు పట్టుకున్నారు.
అటు, జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాలు జలమయం అయ్యాయి. కథలాపూర్ మండలం సిరికొండలో చెరువు నిండి మత్తడి దూకింది. ఫలితంగా చేపలు రోడ్ల మీదకు కొట్టుకొచ్చాయి. వీటిని పట్టుకునేందకు గ్రామస్తులు భారీగా రోడ్ల మీదకు చేరుకున్నారు. ఎవరికి అందిన కాడికి వారు చేతపట్టుకుని ఇళ్లకు చేరారు. రోడ్డుపై కొట్టుకుపోతున్న చేపల కోసం జనాలు ఎగబడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
With lakes and streams full and water spilling on to roads due to heavy rains, locals who noticed fish run to catch some in #Nirmal#TelanganaRains pic.twitter.com/Siap04exxn
— Syed Rizwan Qadri (@Qadrisyedrizwan) July 22, 2021
Read Also..