IND vs AUS: ఈ జ్యోతిష్యుడి మాట నిజమైతే.. రోహిత్ సేనదే ప్రపంచకప్.. లాజిక్ మాత్రమే కాదు.. రీజన్ కూడా ఉందండోయ్..

|

Nov 18, 2023 | 7:54 PM

ICC World Cup 2023: ఈ క్రమంలో ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ప్రముఖ సైంటిఫిక్ జ్యోతిష్కుడు గ్రీన్‌స్టోన్ లోబో(Scientific astrologer Greenstone Lobo) తన ప్రిడిక్షన్ ప్రకటించాడు. అయితే, ఈయన ప్రపంచకప్ ప్రారంభంలోనే తన వివరణ కూడా ఇచ్చాడు. ఆయన ప్రకారం ఈ సారి భారత జట్టుదే ప్రపంచకప్ అని తెలిపాడు. అందుకు గల కారణాన్ని కూడా చెప్పాడండోయ్.

IND vs AUS: ఈ జ్యోతిష్యుడి మాట నిజమైతే.. రోహిత్ సేనదే ప్రపంచకప్.. లాజిక్ మాత్రమే కాదు.. రీజన్ కూడా ఉందండోయ్..
Ind Vs Aus
Follow us on

IND vs AUS: ప్రపంచవ్యప్తంగా క్రీడాభిమానులు రేపటి రోజు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వన్డే ప్రపంచకప 2023లో విజేతగా ఎవరు నిలవనున్నారో చూసేందుకు ఆరాటపడుతున్నారు. టీమిండియానే గెలుస్తుందని కొందరు, ఆస్ట్రేలియానే మరోసారి విశ్వవిజేతగా నిలుస్తుదంటూ ప్రకటిస్తున్నారు. అయితే, ప్రపంచకప్ ప్రారంభంలోనే ఓ జ్యోతిష్యుడు వన్డే ప్రపంచకప్ 2023లో విజేత ఎవరో చెప్పేశారు. అసలు ఎవరాయనా.. ఏ జట్టు గెలుస్తుందని చెప్పారు, అసలు ఆయన చెప్పిన లాజిక్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మొత్తం 10 జట్లతో మొదలైన వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో నాలుగు జట్లు సెమీ ఫైనల్ వరకు వచ్చాయి. అందులో నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో 2011 తర్వాత మరోసారి భారత జట్టు ట్రోపీ రేసులో నిలిచింది. దీంతో టీమిండియా ఈ సారి ప్రపంచకప్ గెలవాలని దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఈ క్రమంలో ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ప్రముఖ సైంటిఫిక్ జ్యోతిష్కుడు గ్రీన్‌స్టోన్ లోబో(Scientific astrologer Greenstone Lobo) తన ప్రిడిక్షన్ ప్రకటించాడు. అయితే, ఈయన ప్రపంచకప్ ప్రారంభంలోనే తన వివరణ కూడా ఇచ్చాడు. ఆయన ప్రకారం ఈ సారి భారత జట్టుదే ప్రపంచకప్ అని తెలిపాడు. అందుకు గల కారణాన్ని కూడా చెప్పాడండోయ్. 1987లో పుట్టిన ఆటగాడు కెప్టెన్‌గా ఉన్న జట్టుదే ఈ సారి ప్రపంచకప్ ట్రోపీ అంటూ ప్రకటించాడు. అందుకు బలమైన కారణాలు కూడా తెలిపాడు. గ్రీన్ స్టోన్ లోబో ఓ జాతీయ మీడియాకు ఇచ్చి ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఆయన ప్రకారంర ‘‘1986/87 సంవత్సరాల్లో పుట్టిన ఆటగాళ్లు సారథులుగా ఉన్న టీంలే ఇటీవల పెద్ద టోర్నీలలో విజయం సాధిస్తున్నాయి. ఉదాహరణకు 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్‌ను గెలిపించిన కెప్టెన్ హ్యూగో లోరిస్ 1986లో జన్మించాడని, అలాగే 2022లో అర్జెంటీనాను ఫిపా వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ లియోనల్ మెస్సీ 1987లోనే జన్మించాడని’’ తెలిపారు.

ఇక క్రికెట్ విషయానిక వస్తే.. 2019 వన్డే ప్రపంచకప్‌ను గెలిచిన ఇంగ్లండ్‌ జట్టు కెప్టెన్‌ ఇయాన్ మోర్గాన్ 1986లోనే జన్మించాడని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా 1987లో జన్మించిన సారథే ప్రపంచకప్ ట్రోపీ గెలుస్తాడంటూ తన వాదనలు వినిపించారు. అయితే, ఇంగ్లండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా కూడా టైటిల్ ఫెవరేట్లుగా ఉన్నా.. ఆయా జట్ల కెప్టెన్ల జాతకం బాగోలేదని, అందుకే వారికి ప్రపంచకప్ గెలిచే అవకాశం లేదంటూ తేల్చారు.

కాగా, ప్రస్తుతం అన్ని జట్ల కెప్టెన్లను పరిశీలిస్తే.. భారత సారథి రోహిత్ శర్మ, బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హాసన్ మాత్రమే 1987లో జన్మించిన వారిలో ఉన్నారు. అయితే, బంగ్లా టీం అంత బలంగా లేదని, ప్రపంచకప్ గెలిచే అవకాశాలు లేవంటూ తెలిపారు. ఈ క్రమంలో భారత జట్టుదే ట్రోఫీ అంటూ తెలిపారు. అయితే, ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకోవడంతో.. రోహిత్ సేనకే ట్రోఫీ గెలిచే అవకాశం ఉంది. అయితే సైంటిఫిక్ జ్యోతిష్కుడు గ్రీన్‌స్టోన్ లోబో చెప్పిన ఈ వివరణాత్మక ప్రిడిక్షన్‌ను కొట్టిపారేయలేం. అందుకు గల కారణాలు కూడా ఉన్నాయి. 2011, 2015, 2019 వన్డే ప్రపంచకప్‌లలో లోబో ప్రకటించినట్లుగానే జరిగింది. దీంతో ఈసారి కూడా ఆయన చెప్పినట్లే జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న అభిప్రాయాలని గమనించాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..