Viral: అప్పుల పాలైతే ఊరందరికీ భోజనం పెడుతున్న రైతులు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

|

Mar 09, 2022 | 3:40 PM

రైతులు అప్పుల పాలయితే ఏం చేస్తారు? వీలైతే బ్యాంకుల్ని ఆశ్రయిస్తారు. లేదంటే వడ్డీ వ్యాపారుల దగ్గరికి పరుగు పెడతారు. కానీ తమిళనాడులో రైతు మాత్రం విందు భోజనం ఏర్పాటు చేస్తాడు.

Viral: అప్పుల పాలైతే ఊరందరికీ భోజనం పెడుతున్న రైతులు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Moi Virundhu
Follow us on

Tamil Nadu: రైతులు అప్పుల పాలయితే ఏం చేస్తారు? వీలైతే బ్యాంకుల్ని ఆశ్రయిస్తారు. లేదంటే వడ్డీ వ్యాపారుల దగ్గరికి పరుగు పెడతారు. కానీ తమిళనాడులో రైతు మాత్రం విందు భోజనం ఏర్పాటు చేస్తాడు. సహపంక్తి భోజనంతో రైతు రాజుగా మారిపోతున్నాడు. నమ్మడం లేదా అయితే ఈ వెరైటీ సంప్రదాయం చూడండి. అవును .. అప్పుల పాలైన రైతులు అంతలా ఖర్చు పెట్టి ఇంతలా కాస్ట్‌లీ భోజనం అరెంజ్‌ చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా? మోయి విరుందు స్పెషాలిటీ ఇది. చినరాయుడు సినిమాలో సీన్‌లాగే.. తమిళనాడులోని పుదుకొట్టై జిల్లాలో మోయి విరుందు అనేది ఓ సంప్రదాయంగా వస్తోంది. ఈ సంప్రదాయం ప్రకారం ఊళ్లో వాళ్లందర్ని భోజనాలకు పిలుస్తారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కరపత్రాలు పంచి అందర్నీ సాదరంగా ఆహ్వానిస్తారు. వచ్చిన వాళ్లందరికీ వెరైటీ కూరగాయలు, స్వీట్లు, చికెన్(Chicken), మటన్‌(Mutton)లతో కూడిన భోజనాన్ని వడ్డిస్తారు. అందుకు ప్రతిపళంగా ఒక్కొక్కరు 50 నుంచి 500 రూపాయల వరకు చదివిస్తారు.

కావేరీ తీరాన ఉండే పుదుక్కోట్టై జిల్లాలోని రైతులు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటారు. బ్యాంకులిచ్చే వడ్డీ రుణాలను వాళ్లు అంగీకరించరు. అలాగని అప్పులు చేయరు. ప్రతీ ఏడాది జులై నుంచి అక్టోబర్‌ మధ్య మోయి విరుందు ఏర్పాటు చేస్తారు. ఈ విందు భోజనంతో వచ్చే మొత్తంతో అప్పుల్లోంచి బయటపడి వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని నెట్టుకొస్తారన్నమాట.

రైతులు, వ్యాపారులపై కరోనా ఎఫెక్ట్

కరోనా కారణంగా రెండేళ్లుగా మోయి విరుందులకి బ్రేక్ పడింది. దీని ఎఫెక్ట్‌ రైతులతో పాటు వ్యాపారులపైనా పడింది. ఈ మధ్య మళ్లీ జిల్లాలోని గ్రామస్తులంతా అంగీకరించడంతో మోయి విరుందు మొదలైంది. చదివింపుల విందులో దాదాపు 5వందల కోట్ల రూపాయలు ఈ రెండు నెలల్లోనే సేకరిస్తారు.

చదివించిన వాళ్లందరికి విధిగా రశీదులు

మోయి విరుందులో చదివింపులు రాసేందుకు ప్రత్యేకంగా సిబ్బంది.. క్యాష్ కౌంట్ చేసేందుకు మెషిన్స్‌ ఏర్పాటు చేస్తారు. డబ్బు చదివించిన వాళ్లందరికి విధిగా రశీదు అందిస్తారు. ఎందుకంటే పిలిచిన వాళ్లు మళ్లీ మోయి విరుందికి వెళ్తే అంతకుమించి చదివించాల్సి ఉంటుంది. ఈ విందుల కారణంగా వడ్డీ లేని రుణాలు, వ్యాపారానికి పెట్టుబడి వస్తుంది. అలాంగుడిలో ప్రారంభమైన ఈ మోయి విరుందు రైతుల పాలిట వరంగా మారుతోంది.

Also Read: Poonam Kaur: పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్.. దర్శకుడు రాక్షసంగా ప్రవర్తించాడంటూ..