Supermoon 2022: మరోసారి కనువిందు చేయనున్న అతిపెద్ద సూపర్‌మూన్‌..ఎప్పుడు, ఎలా చూడాలంటే..?

|

Jul 12, 2022 | 10:41 AM

ఆకాశంలో మరోసారి సూపర్‌మూన్‌ కనువిందు చేయనుంది. ప్రకాశవంతంగా..పింక్ రంగులో కన్పిస్తుంది. ఈ ఏడాది అంటే 2022లో సంభవించే అతి పెద్ద ఖగోళ అద్భుతాల్లో ఒకటి సూపర్‌మూన్.

Supermoon 2022: మరోసారి కనువిందు చేయనున్న అతిపెద్ద సూపర్‌మూన్‌..ఎప్పుడు, ఎలా చూడాలంటే..?
Supermoon
Follow us on

ఆకాశంలో మరోసారి సూపర్‌మూన్‌ కనువిందు చేయనుంది. ఈ నెల 13న అనగా బుధవారం చందమామ భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. భూమికి 3,57,264 దూరంలో చంద్రుడు రానున్నాడు. దీనిని బక్‌ మూన్‌ అని కూడా పిలుస్తారు. బుధవారం రాత్రి 12.07 గంటలకు ఈ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సూపర్‌ మూన్‌ కారణంగా సముద్రాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఈ సమయంలో సముద్ర ప్రాంతాల్లో తుఫానులు వచ్చి.. తీర ప్రాంతాలు వరదలకు దారి తీస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అసలు సూపర్‌మూన్ అంటే ఏంటి, ఎలా కన్పిస్తకుంది, ఎప్పుడు ఏర్పడుతుందనే విషయాలు తెలుసుకుందాం.

సూపర్‌ మూన్‌ అంటే చంద్రుడికి కొన్ని ప్రత్యేక శక్తులు ఉండవు. భూమి చుట్టు చంద్రుడు పరిభ్రమిస్తుంది. ఒక కక్ష్యలో తిరుగుతున్న సమయలో భూమికి దగ్గరికి రావడమే సూపర్‌మూన్‌. దీనిని పెరిజీ అంటారు. ఇది మునుపుటి కంటే కొంచెం పెద్దదిగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.రోజూ కన్పించే చంద్రుడి కంటే పెద్ద పరిమాణంలో కన్పించనుంది. ప్రకాశవంతంగా..పింక్ రంగులో కన్పిస్తుంది. ఈ ఏడాది అంటే 2022లో సంభవించే అతి పెద్ద ఖగోళ అద్భుతాల్లో ఒకటి సూపర్‌మూన్.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి