అది గది లేదా వంటగది అయినా, బొద్దింకలు ఉండటం మంచి సంకేతంగా పరిగణించబడదు. ఎందుకంటే అవి మురికి కాలువ నుంచి బయటకు రావడం ద్వారా మీ ఆహార, పానీయాలను కలుషితం చేస్తాయి. దీనివల్ల అనేక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. అయితే.. మీ ఇంట్లో కూడా బొద్దింకలు పెరుగుతున్నట్లయితే, జాగ్రత్తగా ఉండండి. వెంటనే వాటిని తొలగించే మార్గాలను తెలుసుకోండి. మీ ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉంటే, చింతించాల్సిన అవసరం లేదు. అయితే దీని కోసం మీరు కొన్ని ఇంటి నివారణ చిట్కాలను అనుసరించాలి. బొద్దింకలను వదిలించుకోవడానికి సులభమైన మార్గాలు ఏమిటో తెలుసుకుందాం?
కిరోసిన్‌తో బొద్దింకలను వదిలించుకోండి
మీ వంటగదిలో చాలా బొద్దింకలు ఉంటే, కిరోసిన్ మీకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీనిని ఉపయోగించే ముందు మొదట బొద్దింక జాడలు ఉన్న ప్రదేశాలను గుర్తించండి. దీని తరువాత, ఈ ప్రదేశాలలో కిరోసిన్ ను పిచికారీ చేయండి. కిరోసిన్ వాసనకు బొద్దింకలు పారిపోతాయి. అయితే, కెరిసిన్ స్ప్రే చేసేటప్పుడు మీ చర్మాన్ని కప్పి ఉంచేలా జాగ్రత్త వహించండి.
వేప బొద్దింక భయం నుంచి ఉపశమనం ఇస్తుంది
బేకింగ్ సోడా చాలా ప్రభావవంతంగా..
బొద్దింకలను వదిలించుకోవడానికి బేకింగ్ సోడా కూడా బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం బేకింగ్ సోడాలో పంచదార మిక్స్ చేసి మిశ్రమంలా చేసుకోవాలి. ఆ తర్వాత బొద్దింక ఉన్న ప్రదేశంలో చల్లాలి. ఇది బొద్దింకలను చంపగలదు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం