వీడు మాములు జాతిరత్నం కాదండోయ్.. పెళ్లి గురించి చెప్పమంటే.. ఏకంగా..

ఎగ్జామ్స్ సమయంలో కొంతమంది స్టూడెంట్స్ ఫన్నీ ఆన్సర్స్ రాస్తుంటారన్నది మనం వింటూనే ఉంటాం..

వీడు మాములు జాతిరత్నం కాదండోయ్.. పెళ్లి గురించి చెప్పమంటే.. ఏకంగా..
Funny Answer

Updated on: Oct 12, 2022 | 7:44 PM

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిపోయింది. ఇంకేముంది ప్రపంచం నలుమూలలా ఏం జరిగినా.. అది క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇంటర్నెట్‌లో తరచూ ఫన్నీ వీడియోలు, మీమ్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి. ఇప్పుడివే హాట్ టాపిక్. అందరూ వాటిని తెగ షేర్ చేస్తుంటారు.

ఇదిలా ఉంటే.. ఎగ్జామ్స్ సమయంలో కొంతమంది స్టూడెంట్స్ ఫన్నీ ఆన్సర్స్ రాస్తుంటారన్నది మనం వింటూనే ఉంటాం. ఆ ఆన్సర్స్ తరచూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. పరీక్షల్లో గానీ.. ఏదైనా వీక్లీ టెస్టుల్లో గానీ వచ్చిన క్వశ్చన్స్ తెలియకపోతే జాతిరత్నాలు.. పలు ఫన్నీ ఆన్సర్స్ రాస్తుంటారు. అవి టీచర్స్‌ను బాగా ఆకర్షిస్తే.. వాళ్లు వెంటనే ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్లలో పోస్ట్ చేస్తూ ఉండటం ఇటీవల కాలంలో సర్వసాధారణం అయిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్టూడెంట్ ఓ ప్రశ్నకు క్రేజీ సమాధానం రాశాడు. ఆ ఆన్సర్ చూడగానే కచ్చితంగా టీచర్ మైండ్ బ్లాంక్ కావడం ఖాయం.

పెళ్లి గురించి చెప్పమని క్వశ్చన్ ఇస్తే.. ఈ క్రియేటివ్ ఫెల్లో.. ఏకంగా మ్యారేజ్ అర్ధాన్ని మార్చేశాడు. ఇది చూసిన టీచర్.. ఆ ఆన్సర్‌ను కొట్టేయడమే కాదు.. నాన్‌సెన్స్ అని రాసింది. ప్రజంట్ ఈ ఫన్నీ ఆన్సర్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ‘నిజం చెప్పావ్ రా బుడతా’, ‘అభినవ జాతిరత్నం బాబూ’ అంటూ దీనిపై నెటిజన్లు పంచ్‌లు పేలుస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ న్యూస్ కోసం..