Snake Plant: ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా..? ఈ దిశలో ఉంటే మంచి ఆరోగ్యం, సంపద రెట్టింపు..!

మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. వాటి ముదురు ఆకుపచ్చ రంగు కళ్ళకు ఆహ్లాదకరంగా ఉంటుంది.అంతేకాదు.. వాస్తు పరంగా కూడా స్నేక్‌ ప్లాంట్‌ మంచి ఫలితాలను కలిగిస్తుందని చెబుతున్నారు. స్నేక్‌ ప్లాంట్‌ ఇంట్లో ఉండటం వల్ల సానుకూల శక్తిని కలిగిస్తుంది. ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తుందని జ్యోతిశాష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Snake Plant: ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా..? ఈ దిశలో ఉంటే మంచి ఆరోగ్యం, సంపద రెట్టింపు..!
Snake Plant Benefits

Updated on: May 28, 2025 | 2:14 PM

స్నేక్‌ ప్లాంట్‌ వల్ల ఆ ప్రదేశంలో ఆక్సిజన్ స్థాయిలు పెరిగిపోతాయి. అంతేకాదు గాలిలో ఉండే విష పదార్థాలు బయటికి పంపించేస్తుంది. రాత్రిపూట ఈ స్నేక్ మొక్క ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఇంటి వంట గదిలో పెట్టుకోవడం వల్ల దుర్వాసన వెళ్ళిపోతుంది. ఈ స్నేక్‌ప్లాంట్‌ మొక్క ఇంట్లో ఉండటం వల్ల అలర్జీ సమస్యలు కూడా తగ్గిపోతాయి. స్నేక్ ప్లాంటు వంట గదిలో తేమను కూడా నిర్వహిస్తుంది. దీనికి ఎక్కువ నిర్వహణ కూడా అవసరం ఉండదు. స్నేక్ ప్లాంట్ కి తక్కువ నీటిని మాత్రమే ఉపయోగించాలి. దోమలు ఇతర కీటకాలకు ఇది రెప్పలెంట్ గా పనిచేస్తుంది

స్నేక్‌ ప్లాంక్‌ మంచి ఎయిర్ ప్యూరిఫైయర్‌గా పనిచేస్తుంది. ఇది ఫార్మాల్డిహైడ్, బెంజీన్, ఫార్మాల్డిహైడ్, జిలీన్, టోలుయెన్ వంటి క్యాన్సర్ కలిగించే విషాలను తగ్గించడం ద్వారా గాలిని శుద్ధి చేస్తుంది. పగటిపూట కార్బన్ డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చడం ద్వారా ఇండోర్ గాలిని శుద్ధి చేస్తుంది. పైగా ఈ మొక్కను పెంచేందుకు తక్కువ నిర్వహణ అవసరం. స్నేక్ ప్లాంట్ కు చాలా తక్కువ వెలుతురు, తక్కువ నీరు అవసరం. ఇది ఇంటి లోపల వాతావరణాన్ని సమతుల్యంగా ఉంచుతుంది.

ఈ మొక్క చూడటానికి కూడా అందంగా ఉంటుంది. పొడవాటి, నిటారుగా, కత్తి లాంటి స్నేక్ ప్లాంట్ ఆకులు అందంగా కనిపించడమే కాకుండా మీ ఇంటికి లేదా కార్యాలయానికి అందాన్ని ఇస్తాయి. మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. వాటి ముదురు ఆకుపచ్చ రంగు కళ్ళకు ఆహ్లాదకరంగా ఉంటుంది.అంతేకాదు.. వాస్తు పరంగా కూడా స్నేక్‌ ప్లాంట్‌ మంచి ఫలితాలను కలిగిస్తుందని చెబుతున్నారు. స్నేక్‌ ప్లాంట్‌ ఇంట్లో ఉండటం వల్ల సానుకూల శక్తిని కలిగిస్తుంది. ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తుందని జ్యోతిశాష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..