Snake Tips: బీ కేర్ ఫుల్.. ఈ వాసనంటే పాములకు మస్త్‌ ఇష్టమట..! మీ ఇంట్లో ఉంటే డేంజర్..

వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం తేమ వాతావరణం. వర్షాకాలం కాకపోయినా అప్పుడప్పుడు పాములు ఇళ్లలోకి వస్తుంటాయి. ఇలా ఎందుకు వస్తాయి. ఇందుకు కారణం కొన్ని వాసనలు అంటున్నారు నిపుణులు. పాములు కొన్ని వాసనలను పసిగట్టడం ద్వారా ఇళ్లలోకి ప్రవేశిస్తాయని అంటున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం...

Snake Tips: బీ కేర్ ఫుల్.. ఈ వాసనంటే పాములకు మస్త్‌ ఇష్టమట..! మీ ఇంట్లో ఉంటే డేంజర్..
Smells Attract Snakes

Updated on: Oct 22, 2025 | 3:09 PM

పాము అంటే దాదాపు అందరికీ భయమే జీవి. అలాంటి పాముల్ని కొందరు భక్తితో పూజిస్తారు. ప్రత్యేకించి నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోసి మొక్కుతారు. కానీ, అనుకోకుండా ఇంట్లోకి వచ్చినా లేదంటే, మన పరిసరాల్లోకి పాము వచ్చిందంటే చూడగానే వెన్నులో వణుకు వస్తుంది. అది కాటు వేస్తుందేమో అనే టెన్షన్ మొదలవుతుంది. వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం తేమ వాతావరణం. వర్షాకాలం కాకపోయినా అప్పుడప్పుడు పాములు ఇళ్లలోకి వస్తుంటాయి. ఇలా ఎందుకు వస్తాయి. ఇందుకు కారణం కొన్ని వాసనలు అంటున్నారు నిపుణులు. పాములు కొన్ని వాసనలను పసిగట్టడం ద్వారా ఇళ్లలోకి ప్రవేశిస్తాయని అంటున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం…

పాములకు వాసన చూసే శక్తి ఉంది. పాలు, పసుపు లేదా ఎలుకల వాసన పాములను ఆకర్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, పాములు ముక్కుతో కాదు నాలుకతో, జాకబ్సన్ అవయవంతో వాసన చూస్తాయని చెబుతున్నారు. కప్పలు, బల్లుల వాసన పాములకు ఆహారం సమీపంలోనే ఉందని సూచిస్తుంది.

అప్పుడప్పుడు ఇంట్లో పక్షులు పెట్టుకునే గూళ్ళు కూడా కొన్నిసార్లు పాములను ఆకర్షిస్తాయి.పెంపుడు జంతువుల ఆహారాన్ని ఇంట్లో తెరిచి ఉంచితే, ఎలుకలు లోపలికి వస్తాయి. పాములు వాటిని అనుసరిస్తాయి.

ఇవి కూడా చదవండి

చెక్క కుప్పలు, బట్టలు లేదా చెత్తకుప్పలు పాములకు సురక్షితమైన స్వర్గధామంగా ఉంటాయి. పాత గోడలు లేదా పైపుల రంధ్రాలలోని పగుళ్ల ద్వారా వాసన చూడటం ద్వారా పాములు లోపలికి ప్రవేశించగలవని చెబుతున్నారు.

అలాగే, మొగలి చెట్టును ఇంట్లో పెంచకూడదని అంటారు. ఎందుకంటే.. పాములు ఎక్కువగా మొగలి చెట్టు కింద నివసిస్తాయి. అది వెదజల్లుతున్న వాసనలు పాములను మీ ఇంటికి ఆకర్షిస్తాయి. అందుకే అది మీ ఇంట్లోకి ఎప్పుడూ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. అలాగే, ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటే, పాము కాటును నివారించవచ్చు.

అయితే, పాములు కొన్ని రకాల వాసనలకు దూరంగా పారిపోతాయని చెబుతున్నారు. మన వంటింట్లో లభించే వెల్లుల్లి, ఉల్లిపాయ పాములను తరిమికొడతాయి. ఈ రెండూ ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. అయితే వీటి వాసనను పాములు తట్టుకోలేవని చాలా మందికి తెలియదు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..