Viral: క్వశ్చన్ పేపర్ కాదు గురు..! వెడ్డింగ్ ఇన్విటేషన్ చూస్తే దెబ్బకు షాకవ్వాల్సిందే..!
Viral Wedding Card: ఆధునిక ప్రపంచం.. టెక్నాలజీ పరంగా వేగంగా మార్పులు వస్తున్నాయి. దానికి తగినట్లుగానే ఆలోచన విధానం కూడా మారుతోంది.. చాలా మంది సరికొత్త విషయాల వైపు అడుగులు వేస్తున్నారు. దానికి తగినట్లుగానే జీవితాన్ని మార్చుకుంటున్నారు. రొటిన్‌గా ఆలోచిస్తే లైఫ్ బోర్ కొడుతుంది.. అలా కాకుండా.. తమ ఆలోచన ఓ ట్రెండ్ మాదిరిగా వెరైటీగా ఉండాలనుకుంటున్నారు. ఇలా కొంతమంది వెరైటీగా ఆలోచిస్తూ.. ఓ సెన్సెషన్‌ను క్రియేట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.

Viral Wedding Card: ఆధునిక ప్రపంచం.. టెక్నాలజీ పరంగా వేగంగా మార్పులు వస్తున్నాయి. దానికి తగినట్లుగానే ఆలోచన విధానం కూడా మారుతోంది.. చాలా మంది సరికొత్త విషయాల వైపు అడుగులు వేస్తున్నారు. దానికి తగినట్లుగానే జీవితాన్ని మార్చుకుంటున్నారు. రొటిన్‌గా ఆలోచిస్తే లైఫ్ బోర్ కొడుతుంది.. అలా కాకుండా.. తమ ఆలోచన ఓ ట్రెండ్ మాదిరిగా వెరైటీగా ఉండాలనుకుంటున్నారు. ఇలా కొంతమంది వెరైటీగా ఆలోచిస్తూ.. ఓ సెన్సెషన్‌ను క్రియేట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. అలాంటి విషయతో రూపొందించిన ఓ పెళ్లి కార్డు తాజాగా వైరల్ అవుతోంది. ఓ టీచర్ తన పెళ్లి సందర్భంగా వినూత్నంగా ఆలోచించాడు. పెళ్లి కార్డుల విషయంలో రోటిన్‌గా ఎన్నో చూశాం.. కానీ.. ఇప్పుడు తన పెళ్లి కార్డుతో ఓ సెన్సషనల్ క్రియేట్ చేయాలనుకున్నాడు.. ఇంకేముంది బుర్రకు పదును పెట్టాడు.. వెరైటీగా తన వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డును రూపొందించాడు. అది కూడా ఓ క్వశ్చన్ పేపర్ తరహాలో వివాహ ఆహ్వాన పత్రికను రూపొందించాడు.. ఈ ఆహ్వాన పత్రిక నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇది చూసి అందరూ మురిసిపోతున్నారు.. టీచర్ కు వచ్చిన ఆలోచన సూపర్ అంటూ కితాబిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాకు చెందిన అనిల్ అనే ఉపాధ్యాయుడు తన పెళ్లి కార్డును వెరైటీగా ప్రింట్ చేయించాడు. క్వశ్చన్ పేపర్ తరహాలో పెళ్లి కార్డును ప్రింట్ చేయించగా.. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..
సిద్దిపేట జిల్లాకు చెందిన అనిల్ ఉపాధ్యాయుడు.. అతనికి అక్షర అనే యువతితో పెళ్లి నిశ్చయమైంది. నవంబర్ 19న సిద్ధిపేటలో వీరి వివాహం జరగనుంది. ఈ క్రమంలో అనిల్.. తన పెళ్లిలో టీచర్ మార్క్ కనిపించాలని ఆలోచించాడు. తన కెరీర్‌లో ఎన్నోసార్లు క్వశ్చన్ పేపర్‌ను రూపొందించిన అనిల్‌కు ఓ ఐడియా వచ్చింది. తన ఆలోచనకు పదును పెట్టిన అనిల్ తన పెళ్లి కార్డును వెరైటీగా డిజైన్ చేయించాడు.

Viral wedding card
బంధుమిత్రులు, స్నేహితులు, తెలిసిన వాళ్ల పేర్లతో క్వశ్చన్ పేపర్ స్టైల్‌లో పెళ్లి కార్డును రూపొందించి ప్రింట్ చేయించాడు. ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డులో అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్‌తో పాటు మ్యాచ్ ది ఫాలోయింగ్, ట్రూ ఆర్ ఫాల్స్ టైప్ క్వశ్చన్స్ ను కూడా జోడించాడు. అంతేకాకుండా వాటికి ఆన్సర్లు కూడా అందులోనే ప్రింట్ చేయించాడు.. కళ్యాణ మండపం.. నుంచి పెళ్లి ముహూర్తం వరకు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ టైపులో ఆన్సర్లను ఇచ్చాడు.. మ్యాచ్ ది ఫాలోయింగ్‌లో పెయిర్స్‌ను పెట్టడం విశేషం.. ఇలా తన పెళ్లి కార్డును ఎవ్వరూ ఆలోచించని విధంగా రూపొందించి సెన్సేషనల్‌గా నిలిచాడు. ఈ కార్డుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా.. ఇటీవల కాలంలో చాలామంది పెళ్లి కార్డులను వెరైటీగా డిజైన్ చేయిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో రాజమండ్రికి చెందిన ఓ జంట రెండు వేల రూపాయల నోటు తరహాలో పెళ్లి శుభలేఖను ప్రింట్ చేయించారు. మరికొందరు పెళ్లికి రాకపోయిన పర్వలేదు కానీ.. గిఫ్ట్ కోసం స్కాన్ చేసి డబ్బులు పంపండి అంటూ.. కార్డులోనే యూపీఐను ప్రింట్ చేయిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..