Snails: నత్తలు ఎందుకు మెల్లగా నడుస్తాయో తెలుసా.. ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..

|

Sep 19, 2022 | 9:55 PM

భూమిపై వేగంగా పరిగెత్తే జీవుల్లో చిరుత మొదటి స్థానంలో ఉంటే.. మెల్లగా వెళ్లే వాటిలో నత్తలు ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే ఎవరైనా పనులు మెల్లగా చేస్తే వారిని నత్త నడక..

Snails: నత్తలు ఎందుకు మెల్లగా నడుస్తాయో తెలుసా.. ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..
Snails
Follow us on

భూమిపై వేగంగా పరిగెత్తే జీవుల్లో చిరుత మొదటి స్థానంలో ఉంటే.. మెల్లగా వెళ్లే వాటిలో నత్తలు ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే ఎవరైనా పనులు మెల్లగా చేస్తే వారిని నత్త నడక లేదా నత్తకు నడక నేర్పడం అని అంటారు. ప్రపంచంలోనే ఇంత నిదానంగా కదిలే జీవి మరొకటి లేదు. అయితే నత్తలు ఎందుకు ఇంత నెమ్మదిగా నడుస్తాయనేది నిజంగా ఇంట్రెస్టింగ్ పాయింటే.. ఒక సేకనులో కేవలం ఒక్క మిల్లీ మీటర్ మాత్రమే నడిచే నత్తలు సహనానికి, బద్దకానికి నిదర్శంగా నిలుస్తాయని పలువురు రకరకాలుగా కామెంట్లు చేస్తారు. అయితే ఇవి మరీ ఇంత మెల్లగా నడవడం వెనక ఆసక్తికర విషయాలను నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా వీటి శరీరం కింది భాగంలో జిగురు లాంటి పదార్థం ఉత్పత్తవుతుంది. దీని ఆధారంగానే నత్తలు బండరాళ్ల పై నుంచి పడిపోకుండా గ్రిప్ సాధిస్తాయి. ఇప్పటివరకు భూమిపై 60 వేల రకాల నత్తలు ఉన్నట్లు గుర్తించారు. నత్త మీద ఉండే పెంకు చాలా గట్టిగా ఉంటుంది. కాల్షియం కార్బొనేట్ తో తయారయ్యే ఈ పదార్థం పొరలు పొరలుగా ఉండి నత్తకు రక్షణ కల్పిస్తుంది. నత్త పరిమాణం పెరిగే కొద్దీ షెల్స్‌ సైజ్ కూడా పెరుగుతుంది. వేడిగా ఉన్నా, చలిగా ఉన్నా అవి ఈ షెల్స్‌ లోపల దాక్కుంటాయి. కొన్ని గంటల నుంచి మూడేళ్ల వరకూ సుప్తావస్థ లోకి వెళ్లి హాయిగా నిద్రపోతాయి. కొన్ని నత్తలు ఊపిరితిత్తులతో శ్వాస జరిపితే, మరికొన్ని రకాలు మాత్రం చేపల మాదిరిగా మొప్పల సహాయంతో శ్వాస తీసుకుంటాయి. నత్తలు మూడు సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకూ జీవిస్తాయి.

మొలస్కా జాతికి చెందిన జీవుల్లో ఒకటైన నత్తలతో శాకాహారులు. నత్తలకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తమను తామే బాగుచేసుకుంటాయి. చిప్ప, శరీరానికి ఏదైనా సమస్య వస్తే సెట్ చేసేసుకుంటాయి. నత్తలు స్రవించే జిగురు పదార్థం పై శాస్త్రవేత్తలు పలు అధ్యయనాలు జరిగాయి. 2020లో ఫ్రాన్స్‌లో 60,000 నత్తల నుంచి బురదను సేకరించారు. వాటితో సబ్బులు తయారు చేశారు. 40 నత్తల నుంచి సేకరించిన బురదతో ఓ సబ్బు తయారు చేయగలిగారు. ఈ బురదలో కొల్లాజెన్, ఎలాస్టిన్ అనే పదార్థాలున్నాయి. ఇవి మెడిసిన్ గానూ ఉపయోగపడతాయని సైంటిస్టులు తెలుసుకున్నారు. చర్మ కణాలను కొల్లాజెన్ రిపేర్ చేస్తున్నట్లు నిర్ధరించారు. ఫలితంగా నత్త సబ్బులకు విపరీతమైన క్రేజ్ ఏర్పడుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి