SBI Bank Offers : వినియోగదారులకు అద్బుత్తమైన గోల్డ్ లోన్ ఆఫర్ అందిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. అదేంటంటే
వినియోగదారులకు అద్బుత్తమైన గోల్డ్ లోన్ ఆఫర్ ను తీసుకువచ్చింది ఎస్బిఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) గోల్డ్ లోన్ ను ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు అందిస్తోంది. ఎస్బిఐ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో
SBI Bank Offers : వినియోగదారులకు అద్బుత్తమైన గోల్డ్ లోన్ ఆఫర్ ను తీసుకువచ్చింది ఎస్బిఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) గోల్డ్ లోన్ ను ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు అందిస్తోంది. ఎస్బిఐ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ మేరకు సమాచారాన్ని ఉంచింది. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బిఐ 7.5 శాతం వడ్డీ రేటుతో బంగారు రుణాలను అందిస్తోంది. ఈ అవకాశాన్ని వినియోగదారులందరు సద్వినియోగించుకోవాలని తెలిపింది.
ఎస్‌బిఐ ప్రస్తుతం సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ రేటుతో గోల్డ్ లోన్‌ను అందిస్తోంది. తక్కువ వడ్డీ రేటుతో బ్యాంకులు విక్రయించే బంగరు నాణేలతో సహా బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడం ద్వారా ఎస్బిఐ గోల్డ్ లోన్ పొందవచ్చు అని బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఎస్‌బిఐ బంగారు రుణాన్ని పొందే మార్గాన్ని ఎస్‌బిఐ బ్యాంక్ సూచించింది. ఏదైనా సమాచారం కోసం 1800-11-2211 కు డయల్ చేయవలసి ఉంటుందని బ్యాంక్ తెలిపింది. అలాగే జీఎస్టీ కనీస రూ .250 తో లోన్ మొత్తంలో 0.25 శాతం ఉంటుందని,అలాగే యోనో ద్వారా ఎస్బిఐ గోల్డ్ లోన్ వర్తింపజేస్తే ప్రాసెసింగ్ ఫీజు ఉండదని తెలిపింది. అలాగే ఏదైనా రుణ మొత్తానికి ఎమ్సిఎల్ఆర్ 1 సంవత్సరానికి 0.50 శాతం ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
మరిన్ని ఇక్కడ చదవండి :