Tomato Price: మండుతున్న టమోట ధరలు.. సామాన్యుడు విలవిల.. కిలో ధర ఎంతంటే..?

|

Oct 18, 2021 | 10:16 PM

Tomato Price: దేశంలోని మెట్రో నగరాలలో టమోట ధర విపరీతంగా పెరిగింది. కేజీ టమోటా రూ.50 పైనే నడుస్తుంది. అత్యధిక ధర కోల్‌కతాలో నమోదైంది. ఇక్కడ కిలో

Tomato Price: మండుతున్న టమోట ధరలు.. సామాన్యుడు విలవిల.. కిలో ధర ఎంతంటే..?
Tomato Farming
Follow us on

Tomato Price: దేశంలోని మెట్రో నగరాలలో టమోట ధర విపరీతంగా పెరిగింది. కేజీ టమోటా రూ.50 పైనే నడుస్తుంది. అత్యధిక ధర కోల్‌కతాలో నమోదైంది. ఇక్కడ కిలో టమోటా ధర రూ .93. ప్రభుత్వ డేటా ప్రకారం చెన్నైలో ధర రూ.60, ఢిల్లీలో రూ.59, ముంబైలో రూ.53 గా ఉన్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో సోమవారం కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి.

దేశంలోని 50 నగరాలు, 175 చిన్న పట్టణాలలో టమోటా ధర రూ.50 కంటే ఎక్కువ పలుకుతుంది. ఈ గణాంకాలను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. టోకు మార్కెట్‌లో కూడా టమోటా ధరలు మండిపోతున్నాయి. రిటైల్ ధరపై దీని ప్రభావం కనిపిస్తుంది. కోల్‌కతా హోల్‌సేల్ మార్కెట్‌లో టమోటా కిలో ధర రూ.84, చెన్నైలో రూ.52, ముంబైలో రూ.30, ఢిల్లీలో కిలో రూ.29.50.

మరోవైపు మార్కెట్‌లోకి టమోటాలు రావడం లేదు. వివిధ రాష్ట్రాలలో అకాల వర్షాల వల్ల కూరగాయల సాగు దెబ్బతింది. ముఖ్యంగా టమోటా పంట చాలా వరకు నాశనమైంది. దీని కారణంగా కూరగాయల వ్యాపారులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే వ్యాపారులు టమోటాల ధరను విపరీతంగా పెంచారు. తద్వారా నష్టాన్ని భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడులలో టమోటా ఉత్పత్తి జరుగుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాల కారణంగా చాలా వరకు పంట నష్టం జరిగింది. టమోటా పంట 2-3 నెలల్లో కోతకు సిద్ధంగా ఉంటుంది. ప్రస్తుతం రైతులు తదుపరి పంటకు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రపంచంలో టమోటాల ఉత్పత్తిలో భారతదేశం రెండో స్థానంలో ఉంది. చైనా మొదటి స్థానంలో ఉంది. గరిష్ట ఉత్పత్తి ఉన్నప్పటికీ సీజనల్ పరిస్థితుల కారణంగా ధరలలో మార్పు గమనించవచ్చు. ఇది దాదాపు ప్రతి సంవత్సరం జరుగుతుంది. ముఖ్యంగా అకాల వర్షాల కారణంగా పంటలు నాశనమవుతాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 191 లక్షల టన్నుల టమోటాలు ఉత్పత్తి అవుతాయి. దేశంలో 7.89 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో టమోటాను సాగు చేస్తారు. టమోటా దిగుబడి హెక్టారుకు 25 టన్నులు. ఇంత మంచి సాగు ఉన్నప్పటికీ వర్షం కారణంగా ఉత్పత్తిపై ప్రభావం కనిపిస్తుంది.

Viral Video: టాయిలెట్‌కి వెళ్లింది.. బిడ్డతో బయటకు వచ్చింది.. వైరలవుతున్న వీడియో..

Custard Apple Farming: సీతాఫలం సాగుతో అధిక లాభాలు.. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం..

Viral Video: కత్తులతో భజరంగ్ దళ్ సభ్యుల డ్యాన్సులు.. చర్యలు తీసుకుంటామన్న పోలీసులు.. వీడియో వైరల్..