Red Honey: ఈ తేనె ఆల్కాహాల్ కంటే ఎక్కువ కిక్కు ఇస్తుంది.. ఆ శక్తి కూడా డబుల్ అవుతుందండోయ్..!

తేనె గురించి మనందరికీ తెలిసిందే. తేనెను ఇష్టపడని వారు ఉండరు. తేనేను టేస్ట్ చేయాలని ఉవ్విళ్లూరుతారు. తియ్యగా, టేస్టీగా ఉండే తేనే.. రుచిలోనే కాదు, ఆరోగ్యపరంగానూ ఎంతో మేలు చేస్తుంది. అయితే, మకు తీయ్యని తేనె గురించి మాత్రమే తెలుసు. మరి మద్యం లాగే కిక్కునిచ్చే తేనె గురించి తెలుసా? తేనే కిక్కు ఇవ్వడం ఏంటని తల గోక్కుంటున్నారా? అవునండీ..

Red Honey: ఈ తేనె ఆల్కాహాల్ కంటే ఎక్కువ కిక్కు ఇస్తుంది.. ఆ శక్తి కూడా డబుల్ అవుతుందండోయ్..!
Red Honey

Updated on: Jul 25, 2023 | 10:23 PM

తేనె గురించి మనందరికీ తెలిసిందే. తేనెను ఇష్టపడని వారు ఉండరు. తేనేను టేస్ట్ చేయాలని ఉవ్విళ్లూరుతారు. తియ్యగా, టేస్టీగా ఉండే తేనే.. రుచిలోనే కాదు, ఆరోగ్యపరంగానూ ఎంతో మేలు చేస్తుంది. అయితే, మకు తీయ్యని తేనె గురించి మాత్రమే తెలుసు. మరి మద్యం లాగే కిక్కునిచ్చే తేనె గురించి తెలుసా? తేనే కిక్కు ఇవ్వడం ఏంటని తల గోక్కుంటున్నారా? అవునండీ.. ఈ తేనె మందు కంటే ఎక్కువ కిక్కు ఇస్తుంది. అందుకే దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఉంది. అయితే, ఈ తేనె మన దేశంలో మాత్రం దొరకదండోయ్.. మన పొరుగు దేశం నేపాల్‌లో లభిస్తుంది.

హిమాలయన్ క్లిఫ్ తేనెటీగలు ఈ తేనెను ఉత్పత్తి చేస్తాయి. ఈ తేనేటీగలు విషపూరిత పండ్ల నుండి తేనెను సేకరిస్తాయి. ఇది చాలా మత్తుగా ఉంటుంది. దీంతో పాటు ఇందులో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఈ ఎర్రని తేనెకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గిరాకీ ఉండడానికి ఇదే కారణం. ఈ తేనె అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. సెక్స్ కోరికను పెంచుతుంది. మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అటు ఆరోగ్య ప్రయోజనాలు.. ఇటు మద్యంవంటి కిక్కు ఇవ్వడం కారణంగా దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ డిమాండ్ ఉంది.

ఈ తేనె ఎక్కడ లభిస్తుంది..?

ఇది నేపాల్ దేశంలో హిమాలయ పర్వత శ్రేణుల్లో లభిస్తుంది. ఈ తేనెను తీయడం అంటే ప్రాణాలను పణంగా పెట్టడమే అవుతుంది. సాధారణ తేనేటీగల కంటే ఈ ఎర్ర తేనెను ఉత్పత్తి చేసే తేనెటీగలు చాలా ప్రమాదకరం. గురుంగ్ తెగ ప్రజలు ఎంతో శ్రమించి వెలికితీస్తారు. భారీ పర్వతాలను తాడు సహాయంతో పైకి ఎక్కుతారు. ఆ తరువాత పొగతో తేనెటీగలను తరిమేస్తారు. ఇక కొన్ని సందర్భాల్లో తేనెటీగలు విపరీతంగా కుట్టుతాయి. వాటిని భరించాల్సిన పరిస్థితి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మత్తునిస్తుంది..

ఈ ఎర్ర తేనె తాగితే మద్యం మాదిరిగా మత్తు వస్తుంది. అబ్సింతే మాదిరిగా కిక్కును ఇస్తుంది. అయితే, దీనిని అధికంగా తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..