Propose Day 2023: మీ ప్రేయసికి ప్రపోజ్ చేస్తున్నారా? ఈ పొరపాటు అస్సలు చేయొద్దు..!
ప్రపోజ్ డే ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున ప్రేమికులు తమ భాగస్వామికి ప్రేమను వ్యక్తీకరిస్తారు. వారిని ఎంతగా ఇష్టపడుతున్నారో చెబుతారు.

ప్రపోజ్ డే ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున ప్రేమికులు తమ భాగస్వామికి ప్రేమను వ్యక్తీకరిస్తారు. వారిని ఎంతగా ఇష్టపడుతున్నారో చెబుతారు. అయితే, ప్రేమికులందరూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మితిమీరిన ప్రేమ, ప్రపోజల్ రోజున మీరు చేసే తప్పులు మీ ప్రేమికుడు/ప్రేయసిని మీకు దూరం చేస్తాయి. అందుకే ప్రపోజ్ చేసే ముందు దీన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మరి ఆ గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సర్‌ప్రైజ్..
చాలా మంది ప్రేమికులు.. తమ ప్రేయసి/ప్రియుడికి సర్‌ప్రైజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అయితే, ఆ సర్‌ప్రైజ్ కొన్నిసార్లు రివర్స్ అవుతుంది. అందుకే మీరు ఇవ్వబోయే సర్‌ప్రైజ్ గురించి పూర్తిగా కాకపోయిన, కొంచెమైనా హింట్ ఇవ్వండి. తద్వారా వారు దానిని ఎగ్జైట్‌గా ఫీల్ అవుతారు. లేదంటే.. ప్లాన్ రివర్స్ అయితే, బంధం అంతటితో ఎండ్ అవుతుంది.
విషెష్..
మీరు చెప్పే విషెష్ చాలా స్పెషల్‌గా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. మీ భాగస్వామి గురించి మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది కాబట్టి.. వారికి నచ్చే విధంగా, విభిన్నంగా విష్ చేయండి.




రింగ్‌ను స్వయంగా ఇవ్వండి..
చాలా మంది ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేస్తారు. అయితే, ఈ ఉంగరాన్ని నేరుగా కాకుండా ఆహారంలోనే, ఇతర మార్గాల్లో ఇస్తారు. అయితే, అలా చేయకుండా.. ధైర్యం వెళ్లి ప్రపోజ్ చేయాలి. ఉంగరం ఇచ్చి.. మ్యారేజ్, లవ్ ప్రపోజ్ చేయాలి.
ఏ మూడ్‌లో ఉన్నారో చూసుకోవాలి..
అన్నింటికంటే ముఖ్యమైనది మూడ్. పరిస్థితి/మూడ్ ఎలా ఉందో చూసుకుని ప్రపోజ్ చేయాలి. మీ భాగస్వామి కోపంలో, మూడ్ ఆఫ్‌లోనో ఉన్నప్పుడు ప్రపోజ్ చేస్తే అంతా ఫెయిల్ అవుతుంది. అందుకే, మంచి సమయం, సందర్భం చూసుకుని ప్రపోజ్ చేయండి.
మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..