
తమ ప్రియమైన వ్యక్తులను ఆశ్చర్యపరచడానికి చాలా మంది ప్రజలు గిఫ్ట్స్, సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటారు. ఇంటి ఫ్లవర్ బొకేలు, ఖరీదైన బహుమతులు పంపించి సర్‌ప్రైజ్ ఇస్తుంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో వింత బహుమతులు కూడా అందుతాయి. అలాంటి పరిస్థితితే ఓ ఇంటి సభ్యులకు ఎదురైంది. మ్యాటర్ పోలీసుల వరకు వెళ్లింది. ఇంటి గడప ముందు గిఫ్ట్ బాక్స్ ఉండగా.. దానిని ఓపెన్ చేసి చూస్తే షాకింగ్ సీన్ చోటు చేసుకుంది. ఫ్లవర్ బొకే, గిఫ్ట్ బాక్స్‌లో ప్రైవేట్ పార్ట్ ఉంది. అది చూసి షాక్ అయ్యారు ఆ ఇంటి సభ్యులు, పోలీసులు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మెక్సికోలోని ఓ ఇంటి ముందు భారీ సైజు గిఫ్ట్ బాక్స్ ఉంది. అయితే, అది కాస్త విచిత్రంగా ఉండటంతో.. పేలుడు పదార్థం పెట్టి ఉంటారని అంతా భావించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడికి వచ్చి పరిశీలించారు. బాంబ్ స్వ్కాడ్ కూడా వచ్చి పరిశీలించింది. ఆ తరువాత బాక్స్‌ను ఓపెన్ చేసి పరిశీలించగా.. పేలుడు పదార్థాలు కాదు గానీ, అంతకు మించిన దృశ్యం కనిపించింది. అది చూసి పోలీసులు బిత్తరపోయారు.
ఆ బాక్స్‌లో ఓ వ్యక్తికి సంబంధించిన ప్రైవేట్ పార్ట్ ఉంది. దాని పక్కనే ఓ లేఖ కూడా రాసి ఉంది. దీనిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ బాక్స్ ఎవరు పెట్టారు. ఇలా ఎందుకు చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..