PM Kisan Ninth Installment : పిఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇప్పటివరకు రూ.లక్ష 37 వేల 192 కోట్ల రూపాయలను 10.90 కోట్ల మంది రైతుల ఖాతాల్లో వేశామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఈ పథకాన్ని 2019 లో ప్రారంభించి సంవత్సరానికి రూ.6 వేల రూపాయలను రైతులకు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు 8 వాయిదాలను రైతుల ఖాతాలకు జమ చేసిందన్నారు. ఎనిమిదవ విడత రైతులకు చెల్లించే పనులు జరుగుతున్నాయన్నారు. జూలై 31 లోగా ఇది పూర్తిచేస్తామన్నారు. అనంతరం తొమ్మిదో విడత రైతుల ఖాతాలకు పంపేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సన్నాహాలు ప్రారంభించిదని ప్రకటించారు.
పీఎం కిసాన్ సమ్మాన్ యోజన 30 నెలలు పూర్తి చేశారు..
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ప్రతి సంవత్సరం 6,000 రూపాయలను రైతుల ఖాతాలకు అందిస్తున్నారు. ఇప్పటివరకు 30 నెలలు పూర్తయింది. ఎనిమిదవ విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జూలై 31 లోపు జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వెంటనే పిఎం కిసాన్ యోజన కొత్త విడత సన్నాహాలు ప్రారంభమయ్యాయి. సాయం మొత్తాన్ని పెంచాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఆగస్టు నుంచి పిఎం కిసాన్ యోజన తొమ్మిదవ విడత
పిఎం కిసాన్ సమ్మాన్ యోజన తొమ్మిదవ విడత ఆగస్టు నుంచి సిద్ధం కానుంది. ఈ పథకంలో ఇంకా నమోదు చేయని రైతులు నమోదు చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. రైతులు ఇప్పటికే నమోదు చేసుకున్నట్లు తేలితే వారు ఎనిమిదవ విడత రూ.2,000 కూడా పొందవచ్చన్నారు. పిఎం కిసాన్ సమ్మాన్ యోజన కోసం రిజిస్ట్రేషన్ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా చేయవచ్చు. గత రెండు నెలల్లో రైతుల ఖాతాలకు రూ.21 వేల కోట్లు పంపారు.
అత్యంత విజయవంతమైన ప్రణాళిక
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయం ప్రకారం పిఎం కిసాన్ సమ్మాన్ యోజనను ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం రూ .6,000 రైతుల ఖాతాకు పంపుతారు. సంవత్సరానికి రూ .24 వేలు పెంచాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.