Viral News: శునకాల డీఎన్‌ఏతో యజమానులకు జరిమానాలు.. ఎందుకో తెలుసా?

|

Jul 15, 2021 | 10:17 PM

శునకాల డీఎన్‌ఏ ఏంటి? వాటితో యజమానులకు జరిమానాలు ఏంటని ఆలోచిస్తున్నారా.. అవునండీ. ఇజ్రాయోల్‌లోని టెల్ అవీవ్‌లో అధికారులకు శునకాలతో పెద్ద ఇబ్బంది వచ్చి పడిందంట.

Viral News: శునకాల డీఎన్‌ఏతో యజమానులకు జరిమానాలు.. ఎందుకో తెలుసా?
Dogs Dna
Follow us on

Viral News: శునకాల డీఎన్‌ఏ ఏంటి? వాటితో యజమానులకు జరిమానాలు ఏంటని ఆలోచిస్తున్నారా.. అవునండీ. ఇజ్రాయోల్‌లోని టెల్ అవీవ్‌లో అధికారులకు శునాలతో పెద్ద ఇబ్బంది వచ్చి పడిందంట. అందుకే శుకనాల యజమానులకు జరిమానాలు విధించాలని డిసైడ్ అయ్యారంట. అసలు విషయంలోకి వస్తే.. కుక్కలను వీధుల్లోకి పంపడంతో అవి రోడ్లను అపరిశుభ్రంగా తయారు చేస్తున్నాయంట. దీంతో ప్రతినెలా టెల్ అవీవ్2లోని సివిక్ అధికారులు తెగ ఇబ్బంది పడుతున్నారంట. అలానే కౌన్సిల్ అధికారులు ప్రతినెలా అరటన్నుక పైగా కుక్కల మలాన్ని వీధుల నుంచి తొలగిస్తున్నారంట. దీంతో విసుగెత్తిన అధికారులు శునకాల యజమానులకు బుద్ధి చెప్పేందుకు జరిమానాలు విధించాలని చూస్తున్నారంట.

పెంపుడు జంతువుల నుంచి వచ్చే వ్యర్థాలను వీధుల్లో పడేయడంతో.. రోడ్లన్నీ ఇలా చెత్తగా తయారవుతున్నాయంట. దీంతో శునకాలు గల యజమానులు తప్పనిసరిగా వాటిని రిజిస్టర్ చేయాలని, అలాగే డీఎన్‌ఏ నమూనాలను సమర్పించాలని అధికారులు ఆదేశించారంట. ఈ మేరకు ఓ చట్టం కూడా తయారుచేశారంట. అయితే ప్రస్తుతం అనుమతి కోసం పై అధికారుల చెంతకు చేరిందంట. అక్కడి నుంచి అనుమతి రాగానే వెంటనే ఈ ప్రక్రియను అమలు చేసేందుకు అధికారులు కార్యచరణ చేయనున్నట్లు తెలుస్తోంది.

భవిష్యత్తులో శునకాల వ్యర్థాలనుంచి యజమానుల డేటాను తెలుసుకోవచ్చని, అప్పుడు వీధులను అపరిశుభ్రం చేసినందుకుగాను వారికి జరిమానా విధించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈమేరకు సేకరించిన డీఎన్‌ఏతో యజమానిని ట్రేస్ చేస్తారు. అలా కనుగొన్న యజమానికి జరిమానాను మెయిల్ చేస్తారంట. అలాగే డీఎన్‌ఏ తో టెస్టుల చేసినందుకుగాను… జరిమానాతో పాటు ఆ టెస్టుల ఫీజును కూడా వసూలు చేస్తారంట. భలే వింతగా ఉంది కదు ఇలాంటి రూల్.

Also Read:

Shocking Video: సరదా తీర్చిన ఉయ్యాల.. పట్టు తప్పి 6300 అడుగుల లోయలోకి పడిపోయారు.. అయినా బ్రతికి బయటపడ్డారు..

Viral Video: పెళ్లి వేదికపై వధువును చూసి ఫిదా అయిపోయిన వరుడు.. గుండెపై చేయి వేసి అలా పడిపోయాడు.. ఫన్నీ వీడియో..

Viral Video: బాప్ రే.. ఇంత పెద్ద లాలీపాప్‌ని ఎప్పుడైనా చూశారా?.. అసలెలా తయారు చేశారంటే..!