Love Proposal: ఆమె మోకరిల్లింది.. అతను దాసోహమయ్యాడు.. కొన్ని తియ్యనైన కన్నీళ్లు.. వీడియో

|

Mar 12, 2021 | 4:48 PM

మనసులోని ప్రేమను ప్రేయసి లేదా ప్రియుడికి వ్యక్తపరచడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎన్నుకుంటారు. అవతలివాళ్లు యాక్సెప్ట్ చేసినా, చేయకపోయినా లైఫ్‌లో అదో బెస్ట్ మూమెంట్.

Love Proposal: ఆమె మోకరిల్లింది.. అతను దాసోహమయ్యాడు.. కొన్ని తియ్యనైన కన్నీళ్లు.. వీడియో
Pakistani Girl Proposal
Follow us on

మనసులోని ప్రేమను ప్రేయసి లేదా ప్రియుడికి వ్యక్తపరచడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎన్నుకుంటారు. అవతలివాళ్లు యాక్సెప్ట్ చేసినా, చేయకపోయినా లైఫ్‌లో అదో బెస్ట్ మూమెంట్. తాజాగా పాకిస్థాన్‌లో ఒక అమ్మాయి తన ప్రేమను వ్యక్తపరిచిన విధానం నెటిజన్ల మనసులను తాకుతుంది. మాములుగా ఒక అబ్బాయి నేలమీద మోకరిల్లి, ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్న సంద్భాలు చాలా చూశాం. అయితే, ఇప్పుడు వైరల్ అయిన వీడియోలో, ఒక  అమ్మాయి నేలమీద మోకరిల్లి ఇష్టపడ్డ వ్యక్తికి తన ప్రేమను వ్యక్తం చేస్తోంది. ఆ మూమెంట్, ఆ వాతావరణం, చుట్టూ ఉన్న మిత్రులు.. ఇది నిజంగా వారిద్దరికీ లైఫ్‌లో బెస్ట్ మూమెంట్స్ అని చెప్పాలి. సంబంధిత వీడియో పాకిస్తాన్ నుంచి వచ్చిన విషయం తెలిసిందే. ఈ జంట పూర్తి వివరాలు తెలియదు కానీ.. సదరు వీడియోను ‘uol_inside’ అనే ఖాతా నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

వీడియోలో ఏముందంటే?

వీడియోలో ఒక టేబుల్ నిండా పూల రేకులు ఉన్నాయి. ఒక అమ్మాయి చేతిలో ప్లవర్ బొకేతో నేలపై మోకరిల్లింది. ఆమె ముందు నల్ల చొక్కాలో అందమైన అబ్బాయి నిలబడి ఉన్నాడు. ఆమె మోకాళ్లపై నేలపై కూర్చుని… పుష్పగుచ్చం ఇచ్చి తన ప్రేమను వ్యక్తపరిచింది. అవతల అబ్బాయి కూడా ఆమె ప్రతిపాదనను అంగీకరించి అమ్మాయి చేతిలో నుంచి బొకేను తీసుకున్నాడు. అనంతరం ఆమెను కౌగిలించుకున్నాడు. ఈ సమయంలో ఆ అమ్మాయి కళ్ళలో నీళ్లు తిరిగాయి. మరోవైపు, వారి చుట్టూ ఉన్న కొంతమంది యువకులు ఆ మూమెంట్స్‌ను మొబైల్స్‌లో చిత్రీకరిస్తున్నారు. అబ్బాయి… అమ్మాయి ప్రపోజల్‌ను అంగీకరించిన తరువాత, పక్కన ఉన్న ఫ్రెండ్స్ అరడవం వీడియోలో కనిపించింది.

Also Read:

5వ భార్య భర్తకు మొదట ఫోర్న్ వీడియోలు చూపించింది.. ఆ తర్వాత కాళ్లు, చేతులు కుర్చీకి కట్టింది.. చివరికి..

PM Kisan: రైతుల ఖాతాల్లోకి ఏప్రిల్ నెలలో రూ.2 వేలు.. ఈ వివరాలు సబ్మిట్ చేశారో లేదో చూసుకోండి..