optical illusion: మీ ఐ పవర్‌కి ఓ పరీక్ష.. ఈ ఫొటోలో నక్కి చూస్తున్న ఎలుకను కనిపెట్టగలరా.?

|

Nov 19, 2023 | 3:10 PM

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న వాటిలో ఆప్టికల్ ఇల్యూజన్‌ ఒకటి. చూసే కళ్లను మాయ చేసేలా ఉండే ఇలాంటి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా మన కంటి పవర్‌ను టెస్ట్ చేసే ఫొటోలకు లెక్కే లేదు. తాజాగా నెట్టింట ఇలాంటి ఓ ఫొటోనే వైరల్‌గా మారింది. పైన ఫొటో చూడగానే మీకు ఏం కనిపిస్తుంది.? ఏముంది రంగు రంగులతో ఉన్న పుట్టగొడుగులు అంటారు కదూ.!

optical illusion: మీ ఐ పవర్‌కి ఓ పరీక్ష.. ఈ ఫొటోలో నక్కి చూస్తున్న ఎలుకను కనిపెట్టగలరా.?
Optical Illusions
Follow us on

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఏదొ ఒక అంశం ట్రెండింగ్‌లో నిలుస్తుంటుంది. ముఖ్యంగా యువత ఎక్కువ సమయం సోషల్‌ మీడియాలో గడపడానికి కారణం ఇందులో ఉండే కంటెంట్ అని చెప్పడంలో సందేహం లేదు. నెటిజన్లను ఆకట్టుకుంటూ నిత్యం ఏదో ఒక అంశం వైరల్‌ అవుతూనే ఉంటుంది.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న వాటిలో ఆప్టికల్ ఇల్యూజన్‌ ఒకటి. చూసే కళ్లను మాయ చేసేలా ఉండే ఇలాంటి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా మన కంటి పవర్‌ను టెస్ట్ చేసే ఫొటోలకు లెక్కే లేదు. తాజాగా నెట్టింట ఇలాంటి ఓ ఫొటోనే వైరల్‌గా మారింది. పైన ఫొటో చూడగానే మీకు ఏం కనిపిస్తుంది.? ఏముంది రంగు రంగులతో ఉన్న పుట్టగొడుగులు అంటారు కదూ.! అయితే ఈ పుట్టగొడుల నడుమ ఓ ఎలుక కూడా ఉంది కనిపించిందా.?

 

సదరు ఎలుకను పట్టుకోవడమే ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌ ముఖ్య ఉద్దేశం. ఈ పుట్ట గొడుగుల నడుమ ఓ చిట్టెలుక నక్కి నక్కి మిమ్మల్నే చూస్తోంది. వైట్‌ కలర్‌లో ఉన్న ఎలుకను 15 సెకండ్లలో గుర్తించడం ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌ ముఖ్య ఉద్దేశం. సోషల్‌ మీడియాలోనూ ఈ ఫొటోను షేర్‌ చేసి.. సదరు ఎలుకను కనిపెట్టండి అంటూ ఛాలెంజ్‌ విసురుతున్నారు. మరి మీకు ఆ ఎలుక కనిపించిందేమో ఓసారి ట్రై చేసి చూడండి.

ఏంటి.. ఎంత వెతికినా ఎలుకను పట్టుకోవడం సాధ్యపడడం లేదా.? అయితే ఓసారి చివరి నుంచి రెండో లైన్‌లో ఉన్న పుట్టగొడుగు వెనకాల ఎలుక నక్కి నక్కి చూస్తోంది. ఓవైపు వంగి మరీ.. మిమ్మల్నే చూస్తున్నట్లు ఉంది. ఇంత క్లూ ఇచ్చినా కనిపించకపోతే ఓసారి సమాధానం కోసం కింద ఫొటోలో చూడండి.

మరిన్ని ఆసక్తికర కథనాల కోసం క్లిక్ చేయండి..