
దోమల వల్ల వచ్చే తీవ్రమైన వ్యాధి అంటే మలేరియా దీని గురించి ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ప్రభుత్వాలు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన తరచుగా పడుతుంటారు. ముఖ్యంగా దోమల వల్ల వచ్చే చికన్‌గన్యా, డెంగ్యూ, మలేరియా, జ్వరాలు వంటి వ్యాధుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రత్యేకించి పిల్లలు, శిశువులు ఎక్కువగా వ్యాధి బారిన పడుతున్నారు. ఎందుకంటే వారు బయట ఆడుకుంటారు. అంతేకాదు చిన్నారులు తమంతట తాముగా దోమల కాటు నుంచి తమని తాము రక్షించుకోలేరు. అందువల్ల.. వర్షాకాలంలో పిల్లల కోసం ఆట స్థలాన్ని ఎన్నుకునేటప్పుడు లేదా ఇండోర్ కేర్ తీసుకునేటప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. అయితే ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. సరైన సమయంలో చికిత్స ప్రారంభించినట్లయితే, రోగి రెండు నుంచి ఐదు రోజులలో కోలుకుంటారు. భయంకరమైన జంతువు, పాముల కంటే దోమ చాలా ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. దోమలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి