ఇంటి పైకప్పుపై సోలార్ ప్లాంట్‌ ఏర్పాటు చాలా సులువు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..?

|

Feb 04, 2022 | 2:52 PM

Solar Plants: ఇప్పుడు ఇంటి పైకప్పుపై సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకోవడం చాలా సులువు. ప్రభుత్వం రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్ కింద మీకు నచ్చిన విక్రేత

ఇంటి పైకప్పుపై సోలార్ ప్లాంట్‌ ఏర్పాటు చాలా సులువు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..?
Solar
Follow us on

Solar Plants: ఇప్పుడు ఇంటి పైకప్పుపై సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకోవడం చాలా సులువు. ప్రభుత్వం రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్ కింద మీకు నచ్చిన విక్రేత ద్వారా సోలార్ ప్లాంట్‌ని ఇన్‌స్టాల్ చేయడానికి అనుమతి ఇచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం.. దరఖాస్తుల స్థితిని నమోదు చేయడానికి, ఆమోదించడానికి, ట్రాక్ చేయడానికి జాతీయ పోర్టల్ ఏర్పాటు చేశారు. కొత్త విధానం ప్రకారం.. రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఒక వ్యక్తి ఇప్పుడు జాతీయ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. లబ్ధిదారుడు సబ్సిడీ మొత్తాన్ని బదిలీ చేసే బ్యాంకు ఖాతా వివరాలతో పాటు అవసరమైన సమాచారాన్ని అందించాలి. దరఖాస్తు సమయంలో లబ్ధిదారునికి మొత్తం ప్రక్రియ, సోలార్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేయగల సబ్సిడీ మొత్తం గురించి తెలియజేస్తారు.

దరఖాస్తు 15 రోజుల్లో డిస్కమ్‌లకు

సోలార్ ప్లాంట్‌ కోసం అప్లై చేసిన దరఖాస్తు 15 రోజులలో సంబంధిత డిస్కామ్‌కు ఆన్‌లైన్‌లో ఫార్వార్డ్ చేస్తారు. సాంకేతిక ఆమోదం పొందిన తర్వాత లబ్ధిదారుడు తనకు నచ్చిన ఏదైనా విక్రయదారుడి నుంచి సోలార్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీని కోసం DCR షరతులకు అనుగుణంగా ఉండే సోలార్ మాడ్యూల్‌లను ఎంచుకోవాలి. వాటిని ALMM, J3IS సర్టిఫైడ్ ఇన్వర్టర్‌ల కింద నమోదు చేసుకోవాలి. విక్రేతల జాబితా పోర్టల్‌లో ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.

కొన్ని భద్రతా నియమాలు

సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన తర్వాత సంబంధిత మంత్రిత్వ శాఖ భద్రత నియమాలను జారీచేస్తుంది. లబ్దిదారుడు వాటిని విధిగా పాటించాలి. అలాగే ఒప్పందంలోని నిబంధనల ప్రకారం విక్రేత రాబోయే 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ప్లాంట్‌ను నిర్వహించాలి. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. లబ్ధిదారుడు తన ప్లాంట్‌ను నిర్ణీత వ్యవధిలో ఏర్పాటు చేసుకోవాలి. అలా చేయని పక్షంలో అతని దరఖాస్తు రద్దు చేస్తారు. అతను RTS ప్లాంట్ ఏర్పాటు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Skoda Slavia: ఫిబ్రవరి 10న షోరూమ్‌లలోకి రానున్న స్కోడా స్లావియా.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

జనవరి 2022లో అత్యధిక అమ్ముడైన కార్లు ఇవే.. మారుతి సుజుకి వ్యాగన్ R నెంబర్ వన్

ఈ శ్రీలంక పేసర్ రిటైర్మెంట్ ప్రకటించాడు‌.. టీమిండియాపైనే అరంగ్రేటం.. టీమిండియాతోనే ముగింపు..