Different Marriage: సినిమాను తలపించే ట్విస్ట్.. అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న వరుడు.. అంతలో ఊహించని షాక్.!
Different Marriage: సినిమా సీన్‌ను తలపించేలా ఒకే మండపంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లకు తాళి కట్టిన వరుడు.. ఇప్పుడు...
Karnataka Viral Marriage: సినిమా సీన్‌ను తలపించేలా ఒకే మండపంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లకు తాళి కట్టిన వరుడు.. ఇప్పుడు కటకటాలపాలయ్యాడు. కర్ణాటకలో మే 7వ తేదీన జరిగిన ఈ వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం అధికారుల దృష్టికి వెళ్ళింది.
కర్ణాటకలోని కోలారు జిల్లా వేగామడుగు గ్రామానికి చెందిన సుప్రియ, లలిత అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లను బాగేపల్లికి చెందిన ఉమాపతి మే 7వ తేదీన పెద్దల అనుమతితో ఒకే మండపంలో వారిద్దరినీ వివాహమాడాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ విషయం అధికారులు దృష్టికి వెళ్లడంతో.. రెండో వధువు లలిత మైనర్ అని తెలిసింది. శిశు సంక్షేమ శాఖ, పోలీసులు వరుడుతో సహా ఏడుగురిపై కేసు పెట్టి వరుడిని అరెస్ట్ చేశారు.
బయటపడిన ఆసక్తికర విషయాలు..
సుప్రియ, లలిత ఇరువురూ ఒకే వ్యక్తిని వివాహం చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయితే.. ఆ కుటుంబంలో ఈ వివాహం ఒకటే కాదు గతంలోనూ ఒకటి జరగిందని తెలుస్తోంది. నాగరాజప్ప అతనికి అక్క వరుస అయిన రాణెమ్మ, సుబ్బమ్మలను వివాహం చేసుకున్నాడట. ఇప్పుడు అదే విధంగా మరొక వివాహం జరిగింది.
Also Read:
ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ టైమింగ్ మారిందా.? ఇందులో నిజమెంత.!
ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు సింహం దాగి ఉంది.. ఎక్కడ ఉందో గుర్తుపట్టండి చూద్దాం.!