Flipkart Big Savings Days: ఫ్లిప్‌కార్ట్‌లో నయా సేల్‌ షురూ.. ఆ ఉత్పత్తులపై అదిరిపోయే డిస్కౌంట్లు..

పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి షాపింగ్‌ సంస్థలు వివిధ ఆఫర్లను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ ఫ్లిప్‌కార్ట్‌ సరికొత్త సేల్‌తో మన ముందుకు వచ్చింది. బిగ్‌ సేవింగ్స్‌ డేస్‌ పేరుతో నిర్వహిస్తున్న ఈ సేల్‌లో అనేక ఉత్పత్తులపై భారీ తగ్గింపును అందిస్తుంది. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌ ఈ నయా సేల్‌ను నిర్వహిస్తుంది. ఆగస్టు 4న మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ సేల్‌ ఆగస్టు 9 మధ్యాహ్నం వరకూ కొనసాగనుంది.

Flipkart Big Savings Days: ఫ్లిప్‌కార్ట్‌లో నయా సేల్‌ షురూ.. ఆ ఉత్పత్తులపై అదిరిపోయే డిస్కౌంట్లు..
Online Shopping

Updated on: Aug 03, 2023 | 4:45 PM

ప్రస్తుత రోజుల్లో యువత ఎక్కువగా ఆన్‌లైన్‌ షాపింగ్‌పై ఆసక్తి కనబరుస్తుంది. ఏదైనా వస్తువు కొనే సమయంలో ఆఫ్‌లైన్‌లో అయితే కేవలం షాప్‌ కీపర్‌ చెప్పిన మాటలకు అనుగుణంగామనం వస్తువు కొనుగోలు చేస్తాం. అయితే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే వస్తువు వాడే వారి రివ్యూస్‌  అనుగుణంగా కొనుగోలు చేసే అవకాశం ఉండడంతో ఎక్కువమంది వినియోగదారులు ఆన్‌లైన్‌ షాపింగ్‌ను ఇష్టపడుతున్నారు. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి షాపింగ్‌ సంస్థలు వివిధ ఆఫర్లను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ ఫ్లిప్‌కార్ట్‌ సరికొత్త సేల్‌తో మన ముందుకు వచ్చింది. బిగ్‌ సేవింగ్స్‌ డేస్‌ పేరుతో నిర్వహిస్తున్న ఈ సేల్‌లో అనేక ఉత్పత్తులపై భారీ తగ్గింపును అందిస్తుంది. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌ ఈ నయా సేల్‌ను నిర్వహిస్తుంది. ఆగస్టు 4న మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ సేల్‌ ఆగస్టు 9 మధ్యాహ్నం వరకూ కొనసాగనుంది. కాబట్టి ఈ సేల్‌లో ఏయే ఉత్పత్తులపై తగ్గింపు ధరలను అందిస్తున్నారో? ఓ సారి తెలుసుకుందాం.

బ్యాంకు ఆఫర్లు ఇలా

ఈ సేల్‌లో కొనుగోలు చేసే సమయంలో ఐసీఐసీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డుదారులకు 5 శాతం క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. అయితే ఫ్లిప్‌ కార్ట్‌ యాక్సిస్‌ సూపర్‌ ఎలైట్‌ కార్డుదారులు 16 శాతం అదనంంగా సూపర్‌ కాయిన్లు పొందుతారు. అలాగే ఎంపిక చేసిన కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే నో కాస్ట్‌ ఈఎంఐ పొందవచ్చు. దీంతో పాటు పేటీఎం, యూపీఐ ద్వారా కొనుగోలు చేస్తే అదనపు క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. 

ప్రొడెక్ట్స్‌పై తగ్గింపులు ఇలా

ఈ బిగ్‌ సేవింగ్స్‌ డేస్‌లో ఐ ఫోన్‌, సామ్‌సంగ్‌ ఫ్లిప్‌ఫోన్లపై సూపర్‌ తగ్గింపులు అందిస్తుంది. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఆడియో ఉత్పత్తులు, స్మార్ట్‌ వాచ్‌లు ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం తగ్గింపులను అందిస్తుంది. అలాగే గృహోపకరణాలపై 80 శాతం తగ్గింపును అందిస్తుంది. 

ఇవి కూడా చదవండి

రష్‌ అవర్‌ డీల్స్‌

ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్‌ ప్రతిరోజూ ఉదయం 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు క్రేజీ డీల్స్‌ను అందిస్తుంది. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకూ కొన్ని ఉత్పత్తులపై ప్రత్యేక తగ్గింపులను ఆఫర్‌ చేస్తుంది. అలాగే మన అకౌంట్‌లో ఉన్న సూపర్‌ కాయిన్స్‌ ద్వారా కొన్ని ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌ను ఆసస్‌ ఆఫర్‌ చేస్తుంది కాబట్టి ఆసస్‌ ఉత్పత్తులపై గణనీయమైన తగ్గింపులు రావచ్చని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అయితే ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్లకు ఈ సేల్‌ ఇప్పటికే అందుబాటులో ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌ ఓపెన్‌ చేసి ఉత్పత్తులపై ఓ లుక్కేసేయండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..