Viral news: అనంత విశ్వంలో… సైన్స్‌కు అందని రహస్యాలు, అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అవి మన ఊహలకు, అంచనాలకు ఏమాత్రం అందవు. అలా సూపర్‌పవర్‌గా భావించే వాటిలో ఒకటే ఏలియన్స్. అవి అసలు ఉన్నాయో లేవో తెలియదు కానీ.. ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా… ఏదో ఓ ఉత్కంఠ, ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. అందుకే దశాబ్దాల అన్వేషణలో గ్రహంతరవాసులకు సంబంధించి.. ఏ ఒక్క ఆధారం దొరక్కపోయినా… వెతుకులాట మాత్రం ఆగడం లేదు. తాజాగా.. ఏలియన్స్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వార్తల్లోకి వచ్చింది. పాలపుంతకు అవతలి వైపుకు కొన్ని ఫోటోలను పంపించేందుకు సైంటిస్టులు రెడీ అయ్యారు. గ్రహాంతర వాసులను ఆకర్షించడానికి “హలో” అని చేతులు ఊపుతున్న పిక్సెలేటెడ్ ఇలస్ట్రేషన్‌తో కూడిన మనుషుల నగ్న చిత్రాలను అంతరిక్షంలోకి పంపించాలని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఏలియన్స్ ఒకవేళ ఉండి ఉంటే ఈ చిత్రాలను చూసి బొమ్మల దగ్గరకు వస్తాయని, తద్వారా వాటి ఉనికిని తెలుసుకోవచ్చన్నది పరిశోధకులు వెర్షన్. ‘బీకాన్ ఇన్ ది గెలాక్సీ’ (బిఐటిజి) అనే ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ పనికి పూనుకున్నారు. పిక్సలేటెడ్ ఇలస్ట్రేషన్స్ కాకుండా గురుత్వాకర్షణ, DNA కలిగిన చిత్రాలను కూడా శాస్త్రవేత్తలు చేర్చారు. బైనరీ-కోడెడ్ సందేశాన్ని గ్రహాంతరవాసులు అర్థం చేసుకునే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.
Also Read: Hyderabad: ఇంట్లో గోల్డ్ మిస్సింగ్.. విచారణలో బయటపడ్డ కుమార్తె బాగోతం.. మైండ్ బ్లాంక్ అంతే