May Day 2022: శ్రమ దోపిడీపై పెను గర్జన.. ఆనాటి ఉద్యమానికి గుర్తింపు

|

May 01, 2022 | 7:50 AM

May Day 2022: ప్రపంచ కార్మికోద్యమానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం మే 1న కార్మిక దినోత్సవం నిర్వహిస్తారు. 1886 మే 4న చికాగో నగరంలో 8 గంటల పనిదినం కోసం సమ్మె చేస్తుండగా, పోలీసుల..

May Day 2022: శ్రమ దోపిడీపై పెను గర్జన.. ఆనాటి ఉద్యమానికి గుర్తింపు
Follow us on

May Day 2022: ప్రపంచ కార్మికోద్యమానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం మే 1న కార్మిక దినోత్సవం నిర్వహిస్తారు. 1886 మే 4న చికాగో నగరంలో 8 గంటల పనిదినం కోసం సమ్మె చేస్తుండగా, పోలీసుల కాల్పుల్లో నలుగురు కార్మికులు మరణించారు. 1904లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్టు సభల్లో 8 గంటల పనిదినం కోసం మే 1న పని నిలిపివేసి నిరసన ప్రదర్శనలు జరపాలని తీర్మానించారు. అలా వివిధ దేశాల్లో మే1న కార్మికులు తమ సమస్యలపై స్పందిస్తూ అంతర్జాతీయం (International)గా గుర్తింపు పొందింది. మన దేశంలో మేడే సంబరాలు చెన్నై నగరంలో 1923లో జరిగాయి. లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందూస్తాన్ ఆధ్వర్యంలో 1923, మే1న సింగరవేలు చెట్టియార్ నాయకత్వంలో దేశంలోనే తొలిసారి ఎర్రజెండా ఎగురవేశారు.

ప్రపంచాన్ని బతికించడానికి సూర్య చంద్రులు కార్మికుల్లా పనిచేస్తుంటే, ప్రపంచాన్ని నడిపించడానికి కోట్లాదిమంది కార్మికులు సూర్యచంద్రుల్లా రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఆ కష్టానికి ఫలితాన్ని ఆశించడం ప్రతి ఒక్కరి హక్కు. ఒకప్పుడు మాత్రం అది నేరం. ఎవరైనా ప్రశ్నిస్తే విప్లవకారుడన్న ముద్ర వేసి జైల్లో తోసేవారు. 19వ శతాబ్దం చివరి వరకూ పరిస్థితులు అలానే కొనసాగాయి. ఆరోగ్యాన్నీ, వ్యక్తిగత జీవితాన్నీ పణంగా పెట్టి రోజుకు పన్నెండు గంటలకు పైగా కార్మికులు పని చేసేవారు. దశాబ్దాల తరబడి అదే విధానానికి అలవాటు పడ్డ శ్రామికులు కమ్యూనిస్టు, సోషలిస్టు పార్టీల అండతో మొదట రష్యాలో ‘ఎనిమిది గంటలు పని’ నినాదాన్ని అందుకున్నారు. అది ఇతర దేశాలకూ పాకింది.

చికాగోలో కార్మికులు మే నెల మొదట్లో యాజమాన్యాలకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. అప్పుడు జరిగిన గొడవల్లో కొందరు కార్మికులు చనిపోయారు. వారిని స్మరిస్తూ మరుసటి రోజు ఇంకొందరు కవాతు నిర్వహించారు. ఆ సమయంలో ఎవరో ఆగంతకుడు డైనమైట్‌ విసరడంతో కొందరు పోలీసులూ, సామాన్యులూ చనిపోయారు. ఆ వార్త ప్రపంచవ్యాప్తంగా కార్మిక సంఘాలకు ఆగ్రహం తెప్పించింది. పోరాటాలు ఉద్ధృతమయ్యాయి. ప్రభుత్వాలు దిగొచ్చాయి. పనివేళలను కుదిస్తూ అమెరికా చట్టాన్ని తీసుకొచ్చింది. తరవాత మరికొన్ని దేశాలూ అదే బాట పట్టాయి. మేలో జరిగిన చికాగో దుర్ఘటన గొడ్డు చాకిరీ నుంచి విముక్తికి పునాది వేసింది కాబట్టి, మే 1ని ‘ప్రపంచ కార్మిక దినోత్సవం’గా జరుపుకోవాలని, ఆ రోజు శ్రామికులంతా పనికి విరామమిచ్చి వీధుల్లోకి వచ్చి తమ గొంతు వినిపించాలనీ ప్యారిస్‌లో జరిగిన సోషలిస్టు లేబర్‌ పార్టీల ‘సెకండ్‌ ఇంటర్నేషనల్‌’ సమావేశం నిర్ణయించింది. అదే భారత్‌ సహా అనేక దేశాల్లో ‘మే డే’గా మారింది. చాలా దేశాల్లో ప్రజా ఉద్యమాలకు అదే రోజు శ్రీకారం చుడతారు. ఏదేమైనా కార్మికుల శ్రమను గౌరవించినందుకు జరుపుకునే వేడుకే మేడే. అది నేడే. ఇక మేడే సందర్భంగా సైకత శిల్పం ఎంతగానో ఆకట్టుకుంటోంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

LPG Gas Cylinder Price: వినియోగదారులకు షాక్‌.. పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర..!

Horoscope Today: వీరి సంపదలో పెరుగుదల.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.