Miss India 2020 Runner-up Manya Singh: ఫెమినా మిస్ ఇండియా-2020 టైటిల్‌ను హైదరాబాద్‌కు చెందిన మానస వారణాసి(23) సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైలో జరిగిన గ్రాండ్ ఫినాలో గెలిచి.. ఆమె కిరిటాన్ని అందుకున్నారు. యూపీకి చెందిన మాన్యాసింగ్ మొదటి రన్నరప్‌గా, హర్యానుకు చెందిన మణికా షియోకాండ్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. ఈ ముగ్గురి కీర్తి వెనుక అనేక కథలు, వ్యథలు ఉన్నాయి.
ఫస్ట్ రన్నరప్‌గా నిలిచిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని దేవరియా జిల్లాకు చెందిన మాన్యా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటివరకు ఈ అమ్మాయి పేరు కూడా ఎవరికీ తెలియదు. కానీ ప్రజంట్ గూగుల్ సెర్చ్‌లో ఆమె పేరు ట్రెండింగ్‌లో ఉంది. ఆమె ఓ ఆటో డ్రైవర్ కూతురు. మాన్య తండ్రి ఓంప్రకాశ్ సింగ్ ముంబై వీధుల్లో ఆటో నడుపుతుంటారు. తల్లి మనోరమా దేవి అక్కడే టైలర్ షాప్‌ను నడుపుతున్నారు. పేద కుటుంబంలో జన్మించిన మాన్య చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడింది. చాలాసార్లు ఆమె మంచినీళ్లనే ఆహారంగా తీసుకునేది. డబ్బులు మిగలడం కోసం కిలోమిటర్ల దూరం నడిచి వెళ్లేది. మాన్య కాలేజ్ ఫీజు కోసం వాళ్లమ్మ నగలు తాకట్టు పెట్టింది. చదువకుంటూనే కాల్ సెంటర్లో పార్ట్‌టైమ్ జాబ్ చేసేది మాన్య. కానీ ఇప్పుడు ఆమె దేశం మెచ్చిన అందాల యువరాణి. కాగా రన్నరప్‌గా నిలిచిన అనంతరం సొంతూరుకి వెళ్లిన మాన్య.. తమ కుటుంబాన్ని చిన్నప్పటి నుంచి ముందుకు తీసుకెళ్లిన ఆటో సాక్షిగా తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుంది. మాన్య తల్లి ఎంతో బావోధ్వేగంతో ఆమెను గుండెలను హత్తుకుంది. ప్రస్తుతం ఆ దృశ్యాలను ఎక్స్‌క్లూజీవ్‌గా మీ ముందకు తీసకువచ్చింది టీవీ9. తల్లిదండ్రులకు ఇంతకంటే గొప్ప ఆనందం ఉంటుందా చెప్పండి.
Also Read: