Low Cost House: తక్కువ స్థలంలో.. అతి తక్కువ ఖర్చుతో ఇల్లు..తెలంగాణాకు చెందిన మానస పైప్ ఇంటికి ఆర్డర్ల వెల్లువ!
Low Cost House: ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. కానీ, ఒక అధ్యయనం ప్రకారం ఇండియాలో 63 మిలియన్లకు పైగా ప్రజలకు గృహ వసతి లేదు.
Low Cost House: ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. కానీ, ఒక అధ్యయనం ప్రకారం ఇండియాలో 63 మిలియన్లకు పైగా ప్రజలకు గృహ వసతి లేదు. దేశంలో చాలామంది ఇప్పటికీ గుడిసెలూ.. రేకుల షెడ్లలో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించగలిగితే భారతదేశంలో చాలా మంది పేదవారికి మేలు కలుగుతుంది. ఈ దిశలో ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణాకు చెందిన మానసా రెడ్డి అతి తక్కువ ఖర్చు.. తక్కువ స్థలంలో ఇంటిని నిర్మించావచ్చని రుజువు చేశారు. ఈమె తెలంగాణాలోని బొమ్మకల్ గ్రామానికి చెందినవారు. ఈమె రూపొందించిన ఇల్లు చూసిన చాలా మంది ఆమె ప్రతిభకు ముగ్ధులయ్యారు. ఆమె నిర్మించిన ఇల్లు చూసిన చాలా మంది ఇంజనీర్లు ఆమె ఆలోచనను అభినందించారు. దీంతో ఆమె దేశవ్యాప్తంగా ఇటువంటి ఇళ్ళను పేద ప్రజలకోసం నిర్మించి ఇవ్వాలని స్టార్టప్ ప్రారంభించింది. ఈమె తాయారు చేసిన మోడల్ ఇంటింటి చూసిన వారు ఆమె స్టార్టప్ కంపెనీ ద్వారా ఇంటిని అమర్చుకోవడానికి ఆర్డర్లు ఇస్తున్నారు. కేవలం రెండు నెలల్లో ఆమెకు 200 ఇళ్ళ నిర్మాణానికి ఆర్డర్లు వచ్చాయి. ఈ ఒక్కటీ చాలు ఆమె నిర్మించిన ఇంటి గొప్పతనాన్ని వివరించడానికి.
ఎవరీ మానసా రెడ్డి..
తెలంగాణలోని బొమ్మకల్ అనే చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన మనసా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. హైస్కూల్ పట్టా పొందిన తరువాత ఆమె పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (LPU) నుండి సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ చదువుతున్నపుడే ఆమెకు తక్కువ ఖర్చుతో ఇంటిని నిర్మిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని అనిపించింది. “రహదారి ప్రక్కన ఉంచిన మురుగునీటి పైపులలో నిరాశ్రయులైన ప్రజలు ఆశ్రయం పొందడం నేను గమనించిన సందర్భాలు ఉన్నాయి. ఒక కుటుంబం యొక్క అవసరాలకు తగినట్లుగా పరిమాణాన్ని సవరించగలరా అని నేను ఆశ్చర్యపోయాను, తద్వారా వారు శాశ్వత ఇంటికి తగిన స్థలాన్ని కలిగి ఉండడం నేను గమనించాను. అప్పుడే ఇదే మోడల్ లో ఇల్లు కడితే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఉంటుందని భావించాను.” అని మానస చెప్పారు. దీనికోసం ఆమె జపాన్, హాంకాంగ్లలో కనిపించే తక్కువ-ధర గృహ ఎంపికలపై నెలల తరబడి పరిశోధన చేసిన తరువాత పాడ్ తరహా ఇంటిని తయారు చేయాలనే ఆలోచన ప్రేరణ పొందింది. ఇది కాకుండా, తక్కువ స్థలంలో తక్కువ ఖర్చుతో కూడిన గృహాలను నిర్మించడం గురించి మరింత అర్థం చేసుకోవడానికి ఆమె ఆన్‌లైన్‌లో అనేక పరిశోధనా పత్రాలను కూడా చదివింది.
మానసా రెడ్డి ఈ ఇంటి నిర్మాణం గురించి ఇలా వివరించారు.. ”తక్కువ స్థలంలో.. అతి తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించాలని నేను భావించాను. దానికోసం సిమెంట్ పైప్ లో ఇల్లు తాయారు చేయాలని అనుకున్నాను. దానికోసం ఒక సిమెంట్ పైపుల తయారీదారు వద్ద నుంచి నేను ఇంటిగా మార్చడానికి అనుకూలంగా ఉన్న పరిమాణంలో ఉన్న పైపులను సేకరించాను. అవి వృత్తాకారంలో ఉన్నా.. ముగ్గురు, నలుగురు ఉండే కుటుంబానికి సరిపడే విశాలంగా అనుకూలంగా ఉంటాయి. వినియోగదారుడి అవసరాన్ని బట్టి ఈ ఇంటిని సింగిల్ బెడ్ రూమ్, డబుల్ బెడ్ రూమ్, ట్రిపుల్ బెడ్ రూమ్ గా నిర్మించవచ్చు.” తన నిర్మాణ పనుల కోసం ఆమె సామ్నావి కన్స్ట్రక్షన్స్ అనే స్టార్టప్‌ను ప్రారంభించారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా తక్కువ ఖర్చుతో కూడిన గృహాలను నిర్మించాలని ఆమె భావిస్తున్నారు. ఇప్పడు ఈ ఇళ్ళ నిర్మాణం కోసం ఆమెకు 200 ఆర్డర్లు వచ్చాయి.
మనసు ఉంటె మార్గం ఉంటుంది అని మానసా రెడ్డి నిరూపించారు. ఈ నిర్మాణాన్ని 15 నుండి 20 రోజుల్లో నిర్మించవచ్చు.