లండన్‌లో ఎంబీఏ చేసి ఇండియాలో డెయిరీ ఫామ్‌ పెట్టాడు.. ఇప్పుడు లక్షలు గడిస్తున్నాడు..

|

Nov 08, 2021 | 10:28 PM

Dushyant Bhati: విదేశాల్లో విద్యనభ్యసించి స్వదేశానికి తిరిగి వచ్చిన దుష్యంత్ భాటి గ్రేటర్ నోయిడాలోని అమర్‌పూర్ గ్రామంలో ఆవుల డెయిరీ ఫామ్‌ నిర్వహిస్తున్నారు.

లండన్‌లో ఎంబీఏ చేసి ఇండియాలో డెయిరీ ఫామ్‌ పెట్టాడు.. ఇప్పుడు లక్షలు గడిస్తున్నాడు..
Dushyant Bhati
Follow us on

Dushyant Bhati: విదేశాల్లో విద్యనభ్యసించి స్వదేశానికి తిరిగి వచ్చిన దుష్యంత్ భాటి గ్రేటర్ నోయిడాలోని అమర్‌పూర్ గ్రామంలో ఆవుల డెయిరీ ఫామ్‌ నిర్వహిస్తున్నారు. అంతేకాదు విదేశీ సాంకేతికతను వాడుతూ.. శుభ్రమైన పాలను గాజు సీసాలలో నింపి వినియోగదారులకు విక్రయిస్తున్నారు. పరిశుభ్రతపై అత్యంత జాగ్రత్తలు తీసుకుంటారు. లండన్‌లో ఎంబీఏ చేసిన తర్వాత ఇండియాకి వచ్చి ప్రజలకు ఉపయోగపడే ఏదైనా పని చేయాలని నిర్ణయించుకున్నానని దుష్యంత్ చెప్పారు. ఇందుకోసం ఇజ్రాయెల్, హాలండ్ మొదలైన వివిధ దేశాల్లోని డెయిరీ ఫామ్‌లపై పరిశోధనలు చేసినట్లు కూడా తెలిపారు.

ఆటోమేటిక్ డైరీ ఫామ్
దేశంలో ఉన్న డెయిరీ ఫామ్‌లలో కూలీల కొరత ఉన్న దృష్ట్యా ఆటోమేటిక్ డెయిరీ ఫామ్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తమ పొలంలో ఉన్న ఆవులకు ఆహారం ఇవ్వడం నుంచి పాలు పితకడం, వాటి ఆరోగ్యం, ఇతర విషయాలన్నింటిని డిజిటల్ ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. ఆవుల పాదాలలోని మైక్రో చిప్ పెట్టి దాని నుంచి వివరాలను సేకరిస్తున్నారు. ఈ చిప్ ద్వారా ఆవుకి ఏమి సమస్య ఉంది దానికి ఏ సమయంలో మేత ఇస్తున్నారు అనే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. ఈ ప్రక్రియ నిరంతరం 24 గంటల పాటు కొనసాగుతుంది.

దుష్యంత్ తన పొలంలో ఇచ్చే ఆవు పాలలో ఎలాంటి కల్తీ జరగదని, అలాగే కస్టమర్లు కూడా తన ఫారమ్‌ని సందర్శించవచ్చని ఆహ్వానిస్తారు. వారి నుంచి పాలు-నెయ్యి ఇతర పాల ఉత్పత్తులను విక్రయించే కుటుంబాలు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి ఎలా పంపిణీ చేస్తున్నారో తనఖీ చేయవచ్చని చెబుతారు. ఈ పారదర్శకతను చూసే కస్టమర్లలో ఒక నమ్మకం ఏర్పడింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రచారంలో భాగంగా రాబోయే రోజుల్లో ధన్‌శ్రీ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి నోయిడా-ఎన్‌సిఆర్‌లో మిల్క్ పార్లర్‌ను ప్రారంభించేందుకు దుష్యంత్ కృషి చేస్తున్నారు. ఈ పార్లర్‌లో నెయ్యి, వెన్న, రబ్దీ, కుల్ఫీ, మజ్జిగ వంటి పాలతో తయారు చేసిన ఉత్పత్తులు వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచుతారు.

కళ్ల ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందా..! దృష్టి సమస్యలు ఉంటాయా.. ఈ విషయాలు తెలుసుకోండి..

Britain: బ్రిటన్‌లో విజృంభిస్తున్న మరో వైరస్.. కరోనా గందరగోళంలో మరో సమస్య..

Potato Juice: పొటాటో జ్యూస్‌ ఎప్పుడైనా తాగారా..! ఈ ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధం..