Wonderla: ఓటు ఇంక్ వేసుకుంటే చాలు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన వండర్లా అమ్యూజ్‌మెంట్ పార్క్

ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి అధిక ఓటింగ్ శాతం అవసరం. లోక్‌సభ ఎన్నికల ఎన్నికల్లో మూడు విడతలో ఓటింగ్ శాతం తగ్గుముఖం పట్టడంపై ఎన్నికల సంఘంతో పాటు వివిధ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. పోలింగ్ శాతం తక్కువగా ఉండడంతో అభ్యర్థుల్లో ఆందోళన పెరిగింది. లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ సోమవారం, మే 13న జరగనుంది. దీని ముందు శని, ఆదివారాలు కలిపితే లాంగ్ వీకెండ్ అవుతుంది.

Wonderla: ఓటు ఇంక్ వేసుకుంటే చాలు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన వండర్లా అమ్యూజ్‌మెంట్ పార్క్
Woderla

Updated on: May 11, 2024 | 9:54 PM

ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి అధిక ఓటింగ్ శాతం అవసరం. లోక్‌సభ ఎన్నికల ఎన్నికల్లో మూడు విడతలో ఓటింగ్ శాతం తగ్గుముఖం పట్టడంపై ఎన్నికల సంఘంతో పాటు వివిధ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. పోలింగ్ శాతం తక్కువగా ఉండడంతో అభ్యర్థుల్లో ఆందోళన పెరిగింది. లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ సోమవారం, మే 13న జరగనుంది. దీని ముందు శని, ఆదివారాలు కలిపితే లాంగ్ వీకెండ్ అవుతుంది.

తెలంగాణలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. దీని కోసం ప్రజలను ఓటు వేయమని ప్రోత్సహించే పని ఇప్పటికే ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడంతోపాటు ఓటింగ్ ఆవశ్యకత పట్ల అవగాహన కల్పించటంలో భాగంగా , భారతదేశంలోని అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్కు అయిన వండర్లా హాలిడేస్ లిమిటెడ్ బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. తాము ఓటు వేసినట్లుగా ఎన్నికల అధికారులు వేసే సిరా గుర్తును చూపించే కస్టమర్‌లకు తమ హైదరాబాద్ పార్క్‌కి టిక్కెట్‌లపై 20% తగ్గింపును అందిస్తామని ప్రకటించింది.

వండర్లా హైదరాబాద్ పార్క్‌లో మే 13, 14, 15 తేదీల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బుకింగ్‌లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అయితే ఆఫర్‌ను పొందేందుకు, పార్క్ ప్రవేశ ద్వారం వద్ద సిరా వేసిన వేలును చూపవలసి ఉంటుంది. ఈ కార్యక్రమం గురించి వండర్లా హాలిడేస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ చిట్టిలపిల్లి వివరించారు. “బాధ్యతగల పౌరులుగా, ఓటు వేయడం మన కర్తవ్యం. ఓటు వేయమని వ్యక్తులను ప్రోత్సహించడంలో ఈ కార్యక్రమం మేము వేసిన అతి చిన్న అడుగు అని వండర్లా వద్ద మేము గట్టిగా నమ్ముతున్నాము” అని అరుణ్ అన్నారు. వండర్లా తమ సందర్శకులను ఆన్‌లైన్ వెబ్‌సైట్: https://www.wonderla.com/ ద్వారా గానీ, లేదా 084 146 76333, +91 91000 63636కు కాల్ చేయటం ద్వారా ముందుగా తమ ఎంట్రీ టిక్కెట్‌లను బుక్ చేసుకోమని ప్రోత్సహిస్తుంది వండర్లా..

Wonderla Offer

ప్రజాస్వామ్యంలో అతిపెద్ద వేడుకను విజయవంతం చేసేందుకు వివిధ సంస్థలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్న హోటళ్ళ నిర్వాహకులు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఓటు వేసే ఓటర్లకు లంచ్ బఫేపై 50% తగ్గింపు, డిన్నర్ బఫేపై 30% తగ్గింపు లభిస్తుందని ప్రకటిస్తున్నాయి.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…