Rat Milk: గాడిద పాలు.. ఒంటె పాలు.. మించి ఎలుక పాలు ధర ఉంది. ఎలుక పాలు ఏంటీ అనుకుంటున్నారా..? ఎలుకే అసలు చిన్నగా ఉంటుంది.. దాని నుంచి పాల సేకరణ ఎలా అనుకుంటున్నారా? ఎలుక పాలు అసలు ఎందుకు ఉపయోగిస్తారు? ఎందుకంత ధర? ఇంట్రస్టింగ్ వివరాలు మీకోసం..
మనం ఉదయం లేవగానే ఓ కప్పు కాఫీనో లేదా టీనో తాగుతాం.. పొద్దు పొద్దున్నే లేవగానే గుమ్మం దగ్గర పాల ప్యాకెట్ కోసం చూస్తాం. ఇందుకోసం ఆవు పాలు, గేదె పాలు ఉపయోగించుకుంటాం. కానీ కేవలం ఆవుపాలు, గేదె పాలే కాకుండా.. కొందరు మేకపాలు కూడా వినియోగిస్తుంటారు. ఇలా మనం పాలు అంటే మన వినియోగంలో ఎక్కువగా గేదె, ఆవుపాలు ఉంటుంటాయి. కానీ ఇప్పుడలా కాదు.. పోషకాల పాలు అంటూ గాడిద పాలు, ఒంటె పాలకు కూడా డిమాండ్ పెరిగింది. ఎందుకంటే ఈ పాలల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయని అందరి నమ్మకం. దీంతో ఆ పాలకు మరింత డిమాండ్ పెరిగింది. ఏకంగా వేల రూపాయల ఖరీదుతో గాడిద, ఒంటె పాలు అమ్మకాలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
గాడిద, ఒంటె పాలే అధిక ధరతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే.. ఇప్పుడు ఎలుక పాలు అంతకు మించి అన్నట్లుగా ధర ఉంది. ఎలుక పాలు ఏంటీ? అధిక ధర ఏంటి? అని అనుకుంటున్నారా. అసలు ఎలుకే చిన్నగా ఉంటుంది కదా.. దాని పాలు ఎలా సేకరిస్తారు.. అసలు ఎలుక పాలు దేనికి ఉపయోగిస్తారు అనేది కూడా పెద్ద పెద్ద డౌట్లు వచ్చి తీరుతాయి. మరి ఆ ఎలుక పాలు వింత ఏంటో.. దేనికి వినియోగిస్తారో తెలుసుకుందాం.
లీటరు ఎలుక పాలు 23 వేల యూరోలు.. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 18 లక్షలు.. ఏంటీ దిమ్మ తిరిగిపోయింది కదా! రేటు ఆ రేంజ్ లో ఉంది మరి. రూ. 18 లక్షలు పెడితే ఓ చిన్నపాటి అపార్ట్మెంట్ లోని సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు కొనుక్కోవచ్చు. ఓ మంచి షాపు పెట్టుకొని వ్యాపారం పెట్టుకోవచ్చు. ఓ చిన్నప్రాణి పాలు 18 లక్షలు రూ అంటే ఆమాత్రం ఆశ్చర్యం ఉంటుంది కాదా.. ఎలుక చిన్న ప్రాణి పిల్లలు పెట్టాక దాని శరీరంలో పాలు శాతం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. మరి లీటర్ ఎలుక పాలు సేకరించాలంటే మాటలు కాదు.. లీటరు ఎలుక పాలు సేకరించాలంటే 40 వేల ఎలుకలు కావాల్సి ఉంటుందట. అప్పుడు గానీ లీటర్ పాలు ఉత్పత్తి కావని చెబుతున్నారు. అందుకే ఈ పాలకు అంత ధర ఉంటుందని చెబుతున్నారు.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..