Indian Railways: ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. ప్రతి రోజూ 40 మిలియన్ల మంది ప్రయాణికులు రైళ్లలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తూ ఉంటారు. రైల్వే ప్రతి తరగతికి అనుకూలంగా సౌకర్యాలు ఉంటాయి. అంతేకాదు.. అవసరమైన వారికి ఫీజులో రాయితీలు కూడా కల్పిస్తోంది ఇండియన్ రైల్వేస్. సీనియర్ సిటిజన్లకు రైలు ప్రయాణంలో రాయితీ లభిస్తుందని చాలా మందికి తెలుసు. అయితే, కొన్ని తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కూడా ట్రైన్ టిక్కెట్ ఛార్జీలలో 50 నుండి 100 శాతం వరకు తగ్గింపును రైల్వే ఇస్తుందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ రోగులకు ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, స్లీపర్‌లలో 75 శాతం తగ్గింపు లభిస్తుంది. పేషెంట్‌తో ప్రయాణించే అటెండర్‌కు కూడా ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. హృద్రోగులు వారి శస్త్రచికిత్సకు వెళ్తున్నప్పుడు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. కిడ్నీ సమస్యతో బాధపడేవారు కిడ్నీ మార్పిడీ, డయాలసిస్ కోసం వెళ్తున్నట్లయితే.. రైల్వే వారికి ఛార్జీలలో భారీ తగ్గింపు ఇస్తుంది. అలాంటి పేషెంట్లకు AC-3, AC చైర్ కార్, స్లీపర్, సెకండ్ క్లాస్, ఫస్ట్ ఏసీపై 75 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
మీరు క్యాన్సర్ పేషెంట్‌తో ఎక్కడికైనా వెళితే, AC చైర్ క్లాస్‌లో 75% వరకు తగ్గింపు పొందుతారు. AC-3, స్లీపర్‌లో 100% ఆఫర్ అందుబాటులో ఉంది. అంటే వారు పూర్తిగా ఫ్రీగా ప్రయాణించొచ్చు. ఏసీ ఫస్ట్ క్లాస్, సెకండ్ ఏసీ క్లాస్‌లకు ఫీజులో 50 శాతం రాయితీ లభిస్తుంది. రక్తహీనత రోగులకు స్లీపర్, AC చైర్ కార్, AC-3, AC-2 కోచ్‌లలో రైలు ఛార్జీలలో 50% రాయితీ ఇవ్వబడుతుంది. మరోవైపు, ఆస్తమా రోగులు నెలవారీ, ప్రతి మూడు నెలలకోసారి చికిత్స కోసం కొనుగోలు చేసిన టిక్కెట్‌లపై AC ఫస్ట్, సెకండ్ క్లాస్‌లో ఆఫర్‌లను పొందుతారు.
కుష్ఠువ్యాధితో బాధపడేవారు రైల్వేలో ప్రయాణించడానికి రెండవ తరగతి, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ టికెట్లపై 75% రాయితీ ఇవ్వబడుతుంది. అదే సమయంలో, ఎయిడ్స్ రోగులు చికిత్స కోసం వెళ్ళినప్పుడు, వారికి రెండవ తరగతి టిక్కెట్లలో 50 శాతం వరకు తగ్గింపును అందిస్తారు. హీమోఫిలియా పేషెంట్లకు సెకండ్ క్లాస్, స్లీపర్, ఫస్ట్ క్లాస్, AC-3, AC చైర్ కార్లపై 75% తగ్గింపు లభిస్తుంది.
Watch informative videos on e-ticketing, TDR filing and other such matters. Download IRCTC’s latest learning and training app, IRCTC i-prepare available on Google Playstore.https://t.co/ZmyO78KrYN@RailMinIndia @PIB_India @MIB_India @AmritMahotsav pic.twitter.com/wp4oUC5zuY
— IRCTC (@IRCTCofficial) September 1, 2023
మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..