
IRCTC Maharajas Express: జీవితంలో ఏదో ఒక సందర్భంలో రైలు ప్రయాణం చేస్తూనే ఉంటాము. రైల్వేస్టేషన్, ప్లాట్ఫామ్, రైళ్లల్లో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ రద్దీని చూసిన కొందరు.. ఈ జీవితంలో ఒక్కసారైనా ప్రశాంతంగా, ఖాళీగా, విలాసవంతంగా రైలు ప్రయాణం చేయాలి అనుకుంటారు. అలాంటి వాళ్ల కోసమే ఇండియన్ రైల్వే.. మహారాజాస్ఎక్స్ప్రెస్ను తీసుకొచ్చింది. రైల్వే ప్రయాణికులకు లగ్జరీ అనుభూతిని కల్పించటం కోసం IRCTC మహారాజాస్ ఎక్స్‌ప్రెస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, ఇందులో ప్రయాణించాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. పేరుకు తగ్గట్టే ప్రయాణం కూడా. మహారాజా అనుభూతి పంచడం ఖాయం అని చెబుతోంది ఐఆర్‌సీటీసీ.
ఐఆర్‌సీటీసీ మహారాజాస్ఎక్స్ప్రెస్ లో నాలుగు రకాల టూర్ ప్యాకేజీలు, వివిధ శ్రేణుల్లో కేబిన్లు అందుబాటులోఉంటాయి. 7 రోజుల ప్రయాణానికి ఎంచుకున్న శ్రేణిని బట్టి టికెట్ ధర ఉంటుంది. ప్రముఖ దర్శనీయ స్థలాలు, పర్యాటక ప్రాంతాలు ఈ ప్యాకేజీలో చూడొచ్చు. అక్టోబర్- ఏప్రిల్ మధ్య వివిధ తేదీల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఖర్చు అధికంగా ఉన్నా మర్యాదకు ఏమాత్రం కొదవ ఉండదని మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ అధికారిక వెబ్‌సైట్లో ఐఆర్‌సీటీసీ పేర్కొంది.
తాజాగా కుశాగ్రత్యాల్ అనే యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన వీడియో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మహారాజా ఎక్స్‌ప్రెస్‌లో ఉచిత వైఫై కనెక్షన్, లైవ్ టెలివిజన్, చిన్నతరహా బార్, బాత్రూమ్, షవర్, లివింగ్రూమ్, డైనింగ్రూమ్, మాస్టర్రూమ్.. ఇలా ఈ ట్రైన్లో.. ఎన్నో సౌకర్యాలను, అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఇంకా మరెన్నో ఆశ్చర్యం కలిగించే వసతులు ఉన్నాయని ఆ వీడియోలో పేర్కొన్నారు. అయితే, టికెట్ ధర 19 లక్షల పైమాటేనని వివరించారు.
వీడియో చూడండి..
ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ మహారాజాస్ఎక్స్ప్రెస్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిని చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం..