Indian Tiger : ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లడానికి మనుషులకైతే పాస్‌పోర్ట్ కావాలి కానీ జంతువులకు అవసరం లేదు కదా. అవి ఎలాగైనా వెళ్లొచ్చు. ఇంకా చెప్పాలంటే మనుషులు వెళ్లడానికి ప్రత్యేక రహదారులు కావాలి. కానీ వాటికి దారులతో పనిలేదు. అడవిలో నుంచి అడవికి అలా వెళ్లిపోతాయంతే. అలా నిత్యం ఒక దేశం నుంచి మరొక దేశానికి సంచరిస్తూ ఉంటాయి. ఇటీవల మన భారతదేశానికి సంబంధించిన పులి కూడా ఏకంగా బంగ్లాదేశ్‌కి వంద కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిపోయింది. దాని సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియన్ టైగర్ ఒకటి నాలుగు నెలలపాటు నడిచి 100 కిలోమీటర్లు నడిచి భారతదేశం అడవుల నుంచి బంగ్లాదేశ్ అడవులకు చేరుకుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన భారతదేశంలోని సుందర్ బన్స్ అడవి నుంచి ఓ మగ పులికి నాలుగు నెలల పాటు 100 కిలోమీటర్లు కొండలు కోనలు..వాగులు వంకలు దాటుకుంటూ బంగ్లాదేశ్ లోని మడఅడవులకు చేరుకుంది. సుందర్ బన్ అడవిలోని పులి కదలికలను కనుగొనేందుకు 2010లో రేడియో కాలర్ అమర్చారు. దీంతో ఆ పులి 100 కిలోమీటర్లు దాటి బంగ్లాదేశ్ లోని మడఅడవులకు చేరుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. సుందర్ బన్స్ జాతీయ పార్కును 1987లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. పశ్చిమ బెంగాల్ కే కాకుండా భారతదేశంలోనే సఫారీలు, విహారయాత్రలకు ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఇది ఒకటి.