స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు ప్రతి ఒక్కరి అరచేతిలోనే ప్రపంచం.. ఫోన్ లేకుండా.. క్షణం కూడా ఉండలేని పరిస్థితిలో ఉన్నాం. మన గురించి పూర్తిగా ఒక్క మన మొబైల్‌కు మాత్రమే తెలుసు. రోజూలో ఎక్కువ గంటలు ఫోన్ వాడుతూ.. వీడియోస్ చూస్తూ గడిపేస్తుంటారు. ఇక ఈ లాక్ డౌన్ వలన స్మార్ట్ ఫోన్ ఉపయోగించేవారి సంఖ్య మరింత పెరిగినట్లుగా అధ్యాయనాలు చెబుతున్నాయి. అయితే మన మొబైల్‌ను ఎంత ఎక్కువగా ప్రేమిస్తారో.. అంతకన్నా ఎక్కువగా కాపాడుకుంటుంటారు. కానీ ఇప్పుడు రాబోతున్నది వర్షాకాలం.. ఆ సమయంలో వర్షంలో తడవడం వలన ఫోన్ కూడా తడిచి పూర్తిగా పనిచేయడం ఆగిపోతుంది. అంతేకాదు.. స్క్రీన్ పనిచేయకపోవడం.. ఛార్జీంగ్ సమస్యలు ఎదురవుతుంటాయి. ఇవే కాకుండా.. వర్షంలో ఫోన్ తడసిపోగానే కొందరు ఫోన్ పూర్తిగా విడగొట్టి ఆరబెడతారు. ఇలాంటి తప్పులు చేయడం చాలా డేంజర్. వర్షంలో ఫోన్ తడిసినప్పుడు ఏఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
1. తడిసిన ఫోన్ ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్స్ ఉపయోగించకూడదు. ఎందుకంటే అందులో వేడి అధికంగా ఉంటుంది. ఆ సమయంలో ఫోన్ పేలిపోయే ప్రమాధం ఉంది.
2. జాక్ లోపల తడిగా ఉన్నప్పుడు హెడ్‌ఫోన్ ఉపయోగిస్తే.. జాక్ దెబ్బతింటుంది. సౌండ్ ప్రాబ్లమ్ శాశ్వతంగా వస్తుంది. ఫోన్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే హెడ్ ఫోన్, ఫోన్ ఛార్జీంగ్ ఉపయోగించడం మంచిది.
3. తడిగా ఫోన్ ఉన్నప్పుడు ఛార్జీంగ్ పెట్టకూడదు. ఇలా చేస్తే… ఫోన్ పేలిపోయే అవకాశం ఉంది.
4. ఫోన్ తడిసిపోయిన తర్వాత పాలిథిన్ కవర్ ఎట్టి పరిస్థితులలో చుట్టకూడదు. ఎందుకంటే.. ఫోన్ కు గాలి తగలదు. ఫోన్ లో తేమ ఉండడం వలన సర్క్యూట్లను దెబ్బతీస్తుంది.
5. ఫోన్ తడిసిపోయినప్పుడు వెంటనే దాని భాగాలను విడదీయకూడదు. అలా చేస్తే.. లోపలి భాగాల్లోకి నీరు వెళ్లిపోతుంది.
6. తడిసిన మొబైల్ ను బల్బ్ కింద.. గ్యాస్ దగ్గర పెట్టకూడదు. ఇలా చేయడం వలన ఫోన్ లో ఉన్న లోపలి భాగాలకు హానీ కలుగుతుంది. సహజ వేడిలో మాత్రమే ఉంచాలి.
7. తడిసిన ఫోన్ ను జేబులో ఎక్కువ సేపు ఉంచుకోకూడదు. ఎందుకంటే.. ఫోన్ లోపలి భాగాలకు తేమ వెళ్లిపోతుంది.
8. తడిసిన ఫోన్ ను కొద్ది సమయం వరకు ఉపయోగించకూడదు. ఈ సమయంలో పేలిపోయే అవకాశం ఉంది.
9. ఇంటర్నెట్ సర్ఫింగ్ ఫోన్ బ్యాటరీకి వేగంగా వ్యాపిస్తుంది. ఫోన్ లోపలి భాగాలకు వేగంగా వ్యాపించడం ద్వారా ఫోన్ పనిచేయడం ఆగిపోతుంది.
Also Read: Karthi: హీరో కార్తీ మంచి మనసు.. కూచిపూడి కళాకారులకు అండగా నిలిచిన హీరో.. 50 మందికి ఆర్థిక సాయం…
LIC Alert: LIC కస్టమర్లకు హెచ్చరిక.. అలా చేస్తే ఇబ్బందులు తప్పవంటూ ఎల్ఐసీ వార్నింగ్..