Telangana: మరణంలోనూ వీడని బంధం.. భర్త మరణం తట్టుకోలేక అదే రోజు భార్య మృతి

| Edited By: Balaraju Goud

Feb 14, 2024 | 8:21 PM

భార్యాభర్తల బంధం శాశ్వతం. వారిరువురు ఒకరికోసం ఒకరు బతకడమే జీవితం.. ఇది నిజం.. అందుకు సజీవ సాక్ష్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆ వృద్ద దంపతుల జీవితం.. వీరి భార్యాభర్తల బంధాన్ని చివరకు చావు సైతం బ్రేక్ చేయలేకపోయింది. ఆత్మీయ దంపతులకు నిదర్శనం ఆ జంట. వృద్దాప్యం లోనూ ఒకరికి ఒకరై జీవనం సాగించారు. మరణం లోను వారి బంధం వీడలేదు. భర్త అనారోగ్యంతో చనిపోతే, అదే రోజు భార్య బెంగతో ప్రాణాలు విడిచింది.

Telangana: మరణంలోనూ వీడని బంధం.. భర్త మరణం తట్టుకోలేక అదే రోజు భార్య మృతి
Couple Died In Hours Gap
Follow us on

భార్య భర్తల బంధం అంటే రెండు దేహాలు ఒకే ప్రాణం అన్నారు ఓ కవి. భార్యాభర్తల బంధం అంటే పాలు, నీళ్ళులా కలిసిపోవలని పెద్దలు అంటారు. నిజమే మరీ.. వేరు వేరుగా ఉన్నంత వరకే ఇవి పాలు, ఇవి నీళ్ళు అంటూ చెప్పగలం. కానీ ఆ రెండు కలిసిపోతే మాత్రం పాల నుండి నీళ్లను గాని, నీళ్ళ నుండి పాలను గాని వేరు చేయటం ఎవరికి సాధ్యం కాదు. ఒకసారి ఇద్దరి వ్యక్తుల మద్య ప్రేమానురాగాలతో కూడిన అసలుసిసలైన భార్యాభర్తల బంధం ఏర్పడ్డాక ఆ దంపతులను వేరు చేయటం కూడా ఎవరికీ సాధ్యం కాదు.

భార్యాభర్తల బంధం శాశ్వతం. వారిరువురు ఒకరికోసం ఒకరు బతకడమే జీవితం.. ఇది నిజం.. అందుకు సజీవ సాక్ష్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆ వృద్ద దంపతుల జీవితం.. వీరి భార్యాభర్తల బంధాన్ని చివరకు చావు సైతం బ్రేక్ చేయలేకపోయింది. ఆత్మీయ దంపతులకు నిదర్శనం ఆ జంట. వృద్దాప్యం లోనూ ఒకరికి ఒకరై జీవనం సాగించారు. మరణం లోను వారి బంధం వీడలేదు. భర్త అనారోగ్యంతో చనిపోతే, అదే రోజు భార్య బెంగతో ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన పినపాక మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఆదర్శ దంపతుల హఠాన్మరణం అందరినీ కంటతడి పెట్టించింది.

పినపాక మాజీ సర్పంచ్ సుంకరి రాములు గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఆరోగ్యం క్షిణించిన సుంకరి రాములు మృతి చెందారు. భార్య నర్సమ్మ ఆ బాధని తట్టుకోలేకపోయింది. భర్తతోనే తన గమనం అనుకుందో ఏమో, అదే రోజు సాయంత్రం తాను కూడా తనువు చాలించింది. తల్లి తండ్రి ఒకే రోజు మృతి చెందడంతో వారి పిల్లలు విలపించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది.

రాములు – నర్సమ్మ దంపతులకు ఇద్దరికి కలిపి అంత్యక్రియ నిర్వహించారు కుటుంబ సభ్యులు. దంపతుల అంతిమ యాత్రలో గ్రామస్థులంతా పాల్గొని ఘన నివాళులర్పించారు.ఎనిమిది పదుల వయసులో కూడా వారిద్దరూ ఒకరికి ఒకరై బ్రతికి చివరికి మరణంలో ఒక్కటయ్యారు. తనువులు వేరైనా తాము ఒక్కటే అన్నట్లుగా ప్రపంచానికి తెలియజేశారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…