భారతదేశంలో మీ దాదాపు అన్ని ఆర్థిక అవసరాలకు, కొనుగోళ్లు ఇప్పుడు ఆన్‌లైన్ చెల్లింపు ద్వారా జరుగుతున్నాయి. అందువల్ల, ఇప్పుడు ప్రజలు ఎక్కువ నగదును తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటికీ చాలా పనులకు నగదు అవసరం. భారతదేశంలో ఎవరికైనా నగదు అవసరమైతే బ్యాంకుకు వెళ్లాలి. లేదా నగదు తీసుకోవాలంటే ఏటీఎంకు వెళ్లాల్సిందే. కానీ ఇది కాకుండా మీకు మరొక సాధారణ పద్ధతిని అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర సర్కార్. మీరు మీ ఆధార్ కార్డు ద్వారా కూడా నగదు తీసుకోవచ్చు. ఆధార్ కార్డు సహాయంతో డబ్బును ఎలా విత్‌డ్రా చేసుకోవాలి. దీనికి సంబంధించిన ప్రక్రియ, పరిమితి ఏమిటో తెలుసుకుందాం.
మీరు డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే బ్యాంకు లేదా ఏటీఎం మెషిన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే, మీరు మీ ఆధార్ కార్డును ఉపయోగించి కూడా డబ్బు తీసుకోవచ్చు. అయితే దీని కోసం మీ ఆధార్ కార్డును మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయడం అవసరం. అప్పుడే మీరు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోగలరు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆధార్ కార్డ్ నుండి డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AEPS)ని ప్రారంభించింది. దీని ద్వారా మీరు మీ ఆధార్ కార్డ్‌ని ఉపయోగించి మీ వేలిముద్ర వేయడం ద్వారా ఏదైనా మైక్రో ATM నుండి డబ్బు తీసుకోవచ్చు.
ముందుగా మైక్రో ఏటీఎంలో మీ 12 అంకెల ఆధార్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయాలి. దీని తర్వాత, ధృవీకరణ కోసం మీరు వేలిముద్ర స్కానర్‌లో మీ బొటనవేలు ముద్రను ఇవ్వాలి. దీని తర్వాత మీకు అనేక లావాదేవీ ఎంపికలు కనిపిస్తాయి. దీనిలో మీరు డబ్బు బదిలీ, డబ్బు ఉపసంహరణ ఎంపిక చేసుకోవాలి. ఇందులో మీరు డబ్బు విత్ డ్రా చేసుకోవాల్సి వస్తే, కాబట్టి డబ్బు విత్‌డ్రా చేసుకునే ఆప్షన్‌పై క్లిక్ చేసి అమౌంట్‌ను నమోదు చేయాలి. దీని తర్వాత బ్యాంక్ ఆపరేటర్ మీకు డబ్బు ఇస్తాడు. మీ ఖాతా నుండి డబ్బు తీసివేసుకుంటారు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు సందేశం ద్వారా సమాచారం అందుతుంది.
ఆధార్ కార్డు నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి వివిధ బ్యాంకులు వేర్వేరు పరిమితులను విధించాయి. కొన్ని బ్యాంకుల్లో ఈ పరిమితి రూ.10 వేలు. మరి కొన్ని బ్యాంకుల్లో ఈ పరిమితి రూ.50 వేలు. భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని బ్యాంకులు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్‌ను డిసేబుల్ చేశాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..