AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Owl: భారతదేశంలో ఎన్ని రకాల గుడ్లగూబలు ఉన్నాయి? ఏ పక్షి తన మెడను 270 డిగ్రీలు తిప్పగలదు!

చాలామంది ఇప్పటి వరకు నలుపు లేదా గోధుమ రంగు గుడ్లగూబలను చూసి ఉంటారు. ఇందులో తెల్లవి కూడా ఉంటాయి. కొన్ని అరుదైన గూడ్లగుబలు ఉంటాయి. ఇవి మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. మరి గూడ్లగుబలు ఎన్ని రకాలు ఉంటాయి.. ఎన్ని రకాల జాతులు ఉంటాయో తెలుసుకుందాం..

Owl: భారతదేశంలో ఎన్ని రకాల గుడ్లగూబలు ఉన్నాయి? ఏ పక్షి తన మెడను 270 డిగ్రీలు తిప్పగలదు!
Subhash Goud
|

Updated on: Oct 24, 2024 | 1:32 PM

Share

గుడ్లగూబ.. దీనికి సంబంధించి అనేక నమ్మకాలు ఉన్నాయి. కొంతమంది గుడ్లగూబ కనిపిస్తే శుభ సూచకంగా భావిస్తారు. మరికొంతమంది అశుభకరంగా పరిగణిస్తారు. గుడ్లగూబల్లో రకరకాల జాతులు ఉంటాయి. అలాగే వారి రంగు కూడా రకరకాలుగా ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల గూడ్లగుబలు ఉన్నాయి.

  1. ఏ పక్షి తన మెడను 270 డిగ్రీలు తిప్పగలదు?: గుడ్లగూబల శరీర నిర్మాణం అవి తమ మెడను 270 డిగ్రీల వరకు తిప్పగలవు. చాలా సామర్థ్యాలు ఉన్నప్పటికీ గుడ్లగూబ పగటిపూట పెద్దగా చూడలేకపోయినా.. రాత్రిపూట మాత్రం కంటి చూపు బాగా పని చేస్తుంది. గుడ్లగూబ కళ్ళు చాలా పెద్దవి ఉంటాయి.
  2. భారతదేశంలో ఎన్ని రకాల గుడ్లగూబలు ఉన్నాయి?: భారతదేశంలో దాదాపు 36 రకాల గుడ్లగూబలు కనిపిస్తాయి. ఇందులో రకరకాల జాతులుఉంటాయి. వీటిలో ప్రధానంగా బ్రౌన్ హాక్ గుడ్లగూబ, కాలర్డ్ గుడ్లగూబ, మచ్చల గుడ్లగూబ, రాక్ ఈగిల్ గుడ్లగూబ, మచ్చల ఆముద గుడ్లగూబ, ఆసియన్ బార్డ్ గుడ్లగూబ, బోయర్ గుడ్లగూబ ఉన్నాయి.
  3. కొమ్ముల గుడ్లగూబ ఎక్కడ కనిపిస్తుంది?:  ఇండియన్ డేగ గుడ్లగూబ – రాక్ ఈగిల్-ఔల్ లేదా బెంగాల్ ఈగిల్-ఔల్ అనేది భారత ఉపఖండంలోని పర్వత, రాతి స్క్రబ్ అడవులలో కనిపిస్తుంటాయి. దీనిని కొమ్ముల గూడ్లగుబ అని కూడా అంటారు.
  4. హిమాలయ ప్రాంతాలలో ఏ జాతి గుడ్లగూబలు కనిపిస్తాయి?:  బార్న్ గుడ్లగూబ హిమాలయ ప్రాంతాలలో కనిపిస్తుంది. దీనిని ఇండియన్ బార్న్ ఔల్, వైట్ గుడ్లగూబ అని కూడా పిలుస్తారు. ఇది గుడ్లగూబలో అరుదైన జాతి.
  5. ఇవి కూడా చదవండి
  6. ఏ గుడ్లగూబ గద్దలా కనిపిస్తుంది?: ఉత్తర హాక్ గుడ్లగూబకు ఈకలు ముదురు గోధుమ రంగులో ఉంటాయి. మెడ వెనుక భాగం మినహా శరీరంపై ఒక ఆఫ్-వైట్ స్పాటింగ్ నమూనా కలిగి ఉంటుంది. ఇది నలుపు V- ఆకారపు నమూనాను కలిగి ఉంటుంది. ఇది గద్దలా కనిపిస్తుంది.
  7. ఉత్తర హాక్ గుడ్లగూబ ఆహారం ఏమిటి?: నార్తర్న్ హాక్ గుడ్లగూబ బొడ్డు దిగువ భాగం తెల్లగా ఉంటుంది. ఉత్తర హాక్ గుడ్లగూబలు మాంసాహారులు. ఇవి చిన్న జంతువులు, పక్షులను వేటాడతాయి.
  8. గుడ్లగూబలో ఎన్ని ఉపజాతులు ఉన్నాయి?: యురేషియన్ ఈగిల్-గుడ్లగూబ: ఇది యూరప్, రష్యా, మధ్య ఆసియాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. కనీసం 12 ఉపజాతులు ఉన్నాయి.
  9. ప్రపంచంలో ఎన్ని రకాల గుడ్లగూబలు ఉన్నాయి?: ప్రపంచవ్యాప్తంగా సుమారు 250 రకాల గుడ్లగూబలు ఉన్నాయి. వాటిలో 50 జాతులు ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు.
  10. గుడ్లగూబలు పగటిపూట ఎందుకు కనిపించవు?: పగటి పూట గుడ్లగూబకు కళ్లు కనిపించవు. అందుకే దాని కళ్ళు అస్పష్టంగా కనిపించడంతో పగలు కనిపించదు. గుడ్లగూబ పగటిపూట బయటకు వెళ్లడానికి ఇష్టపడకపోవడానికి ఇదే కారణం. తానూ ఇబ్బందుల పడతాననఏ కారణంగా బయటకు రాదని జంతు నిపుణులు చెబుతున్నారు.
  11. గుడ్లగూబ రాత్రిపూట ఎలా స్పష్టంగా చూడగలుగుతుంది?: గుడ్లగూబ కళ్లలో రాడ్లు ఉంటాయట. ఇవి పగటి కంటే రాత్రి చూసేలా చేస్తాయని చెబుతుంటారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి