Viral Video: సోషల్ మీడియాలో వింతలు, విశేషాలకు కొదవే ఉండదు. ప్రతి రోజూ ఏదో ఒక వీడియో/ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్‌నెట్ వేదికగా వైరల్ అవుతోన్న ఓ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మీలో చాలా మంది రాజమౌళి ఈగ సినిమాను చూసే ఉంటారు. అందులో చనిపోయిన హీరో మళ్లీ ఈగ రూపంలో జన్మించిన విలన్‌పై పగ తీర్చుకుంటాడు. ఈ సమయంలో ఈగ చేసే విన్యాసాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే అది సినిమా, గ్రాఫిక్స్ కాబట్టి సాధ్యమవుతుందని అంటారా? ఇలాంటి ఘటనే నిజ జీవితంలో జరిగితే ఎలా ఉంటుంది?
వినడానికి కూడా నమ్మశక్యంగా లేని ఈ సంఘటన నిజంగానే జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మైకేల్ మోరాన్ అనే వ్యక్తి ట్వీట్ చేసిన వీడియోలో రెండు తేనెటీగలు ఫాంటా బాటిల్ క్యాప్‌ను తీసే ప్రయత్నం చేశాయి. మూతకు రెండు వైపులా రెండు తేనెటీగలు తిరుగుతూ చివరికి క్యాప్‌ను ఓపెన్ చేశాయి. దీనంతటినీ అక్కడే ఉన్న వ్యక్తి మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించారు. దీంతోఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే సుమారు 3.4 మిలియన్ల మంది వీక్షించగా.. లక్షకుపైగా లైక్స్‌తో పాటు, రెండున్నర లక్షలు రీట్వీట్ చేశారు. వైరల్‌గా మారిన ఈ వీడియోను మీరూ ఓసారి చూసేయండి..
Well, that’s it for humanity. We’ve had a decent run but if bees have mastered the screw-top lid I think this is the beginning of the end. pic.twitter.com/XyHonJ2q73
— Michael Moran (@TheMichaelMoran) May 25, 2021
భారత నిబంధనలపై ట్విటర్ ఫైర్, పోలీసుల చేత దాడులు చేయించి బెదిరిస్తారా అంటూ మండిపాటు