లాటరీ టికెట్లు అమ్మే ఈ యువతి నిజాయితీ గురించి చెబితే మీరు కూడా హ్యాట్సాప్ చెబుతారు. ఏకంగా రూ.6 కోట్ల విన్నింగ్ లాటరీని కస్టమర్‌కు ఇచ్చేసి తన మనసు ఎంత గొప్పదో ఆమె చాటుకుంది. ఆ టికెట్ తనదేనని చెప్పే అవకాశం ఉన్నా.. ఈమె ఆ మార్గాన్ని ఎన్నుకోలేదు. దీంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..లాటరీ అమ్మి జీవనం సాగించే కోచికి చెందిన స్మిజా మోహన్ వద్ద ఇటీవల 12 టికెట్లు మిగిలిపోయాయి. ఆ రోజు సండే కావడం లాటరీ టికెట్లు కొనేందుకు ఎవరూ పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదు. దీంతో ఆమె లాటరీ టికెట్స్ ఎక్కువగా కొనేవారితో క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూపులో వాటిని పోస్టు చేసింది. అయినా కూడా ఎవరూ ఆ టికెట్లు కొనేందుకు ఎవరూ ఆసక్తి కనబరచలేదు. ఈక్రమంలో ఆమె తెలిసిన కస్టమర్ అయిన చంద్రన్ చేతన్ అనే వ్యక్తికి ఫోన్ చేసింది. అతడు అన్నీ కాదు కానీ కొన్ని నంబర్లు కావాలని చెప్పాడు. అయితే అనూహ్యంగా అతడికి అదృష్టం వరించింది. సరిగ్గా అతడు చెప్పిన నెంబర్లకే బంపర్ లాటరీ తగిలింది. ఈ విషయం తెలిసిన వెంటనే స్మిజా… ఆ టికెట్‌ను తన వద్ద ఉంచుకోకుండా చంద్రన్ విషయం చెప్పి ఇచ్చేసింది. ఆమె తలచుకుంటే ఆ టికెట్‌కు ఏమి రాలేదని చెప్పి.. మొత్తం డబ్బును తీసుకోవచ్చు. కానీ, కస్టమర్‌ను దేవుడిగా భావించిన ఆమె .. రూ.6 కోట్లకు తగిలిన లాటరీ టికెట్‌ను అతడి చేతిలో పెట్టి.. తన గొప్ప మనసు చాటుకుంది.
స్మిజ, ఆమె భర్త కలిసి అలువాలోని రాజాగిరి ఆస్పత్రి దగ్గర్లో లాటరీ స్టాల్ నడుపుతోంది. తొలుత ఈ దంపతులు కక్కానడ్‌లోని గవర్నమెంట్ ప్రెస్‌లో వర్క్ చేసేవాళ్లు. అక్కడ ఉద్యోగాలు పోవడంతో.. లాటరీ టికెట్ల విక్రయాన్నే ఉపాధిగా మలుచుకున్నారు. ఒకవైపు పేదరికం వేధిస్తున్నా కూడా.. ఆమె మాత్రం తన వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించి.. నెటిజన్ల మనసు గెలుచుకుంది.
Also Read: చేపను కొనుగోలు చేసిన వ్యక్తి.. దాన్ని కటింగ్ చేయిస్తుండగా కడుపులో షాకింగ్ దృశ్యం
ఏపీలోని ఆ ప్రాంతంలో పక్షులు, జంతువుల వింత మరణాలు.. అసలు అలా ఎలా జరుగుతుంది..?