Milk Adulteration: ఒక్క చిన్న ట్రిక్‌తో.. పాలు కల్తీనో.? కాదో.? ఈజీగా గుర్తించండిలా..
కల్తీకి కాదేది కనర్హం. ఉప్పు, పప్పు, కారం, కారంపొడి, నెయ్యి, పెరుగు.. ఇలా ఒక్కటేమిటి ఈ మధ్యకాలంలో అన్ని కల్తీ మయమవుతున్నాయి. ఇక అవి మన కడుపులో పడితే..

కల్తీకి కాదేది కనర్హం. ఉప్పు, పప్పు, కారం, కారంపొడి, నెయ్యి, పెరుగు.. ఇలా ఒక్కటేమిటి ఈ మధ్యకాలంలో అన్ని కల్తీ మయమవుతున్నాయి. ఇక అవి మన కడుపులో పడితే.. లేనిపోని రోగాలతో ఆసుపత్రి పాలవ్వడం ఖాయం. డబ్బులు ఎక్కువ సంపాదించాలన్న అత్యాశతో కొంతమంది పాల వ్యాపారస్తులు.. సగం పాలల్లో సగం నీళ్లు, యూరియా, సన్‌ఫ్లవర్ ఆయిల్ లాంటి పదార్ధాలను కలుపుతారు. మొదటిగా వీళ్లు 10 లీటర్ల పాలలో సగం పాలు తీసేసి పైన పేర్కొన్న పదార్ధాలను కలిపి.. ఆ తర్వాత మిక్సీ పడతారు. రెండూ కూడా చిక్కగా మారిపోయేసరికి.. జనాలు అవి చిక్కని పాలనుకుని అపోహ పడతారు. ఇక ఇలాంటి కల్తీ పాలు తాగడం వల్ల సాధారణ అనారోగ్య సమస్యల దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అనేక రోగాల బారిన పడవచ్చు.
అసలు ఇంతకీ పాలల్లో నీళ్లు కలిపారో.? లేదో.? పాలు కల్తీ చేసారో.? లేదో.? ఇలా ఈజీగా కనిపెట్టొచ్చు. రూపాయి ఖర్చు లేకుండా.. ఎలాంటి పరికరం ఉపయోగించకుండా ఈ చిన్న ట్రిక్‌తో ఒరిజినల్ పాలను గుర్తించవచ్చు. అందుకోసం మీరు చేయాల్సిందల్లా.. రెండు చుక్కల పాలను ఒక చదునైన బండపై వేయండి. అది మెల్లిగా ఒకవైపు పారుతాయి. అవి పారుతున్న దశలో తెల్లగా కనిపిస్తే.. స్వచ్చమైన పాలని లెక్క. ఒకవేళ కల్తీ పాలు అయితే.. అవి తెల్లగా కనిపించవు. ఇక పాలల్లో నీళ్లు కలిపారో.. లేదో తెలుసుకునేందుకు మార్కెట్‌లో లాక్టోమీటర్ దొరుకుతోంది. ఇది మీకు రూ.100 -300 మధ్య దొరుకుతుంది. అలాగే పాలు కల్తీనో.. కాదో తెలుసుకునేందుకు పీహెచ్ స్ట్రిప్ కూడా ఉపయోగించవచ్చు. పీహెచ్ రేషియో 6.4-6.6 మధ్య రావాలి. అలా కాకుండా వేరే సంఖ్య ఏది వచ్చినా.. పాలు కల్తీ అని లెక్క.