Prakasam District: సమాధి తవ్వి చనిపోయిన బిడ్డకు పాలు పట్టిన తల్లి.. గుండెలు పిండేసే ఘటన

|

Apr 01, 2022 | 6:27 PM

కన్నబిడ్డకోసం ఓ తల్లి పడిన ఆరాటం అంతా కాదు. చనిపోయిన బాబును పూడ్చిపెట్టినా..బ్రతికే ఉన్నట్లు ఆమెకు కలలో కనిపించాడు. అంతే సమాధి తవ్వి బాబును వెలికితీసి పాలు పట్టించింది ఆ తల్లి. ఆ తర్వాత...

Prakasam District: సమాధి తవ్వి చనిపోయిన బిడ్డకు పాలు పట్టిన తల్లి.. గుండెలు పిండేసే ఘటన
Baby Death
Follow us on

(గమనిక: ఈ కథనానికి జతచేసిన ఫోటో మీ  హృదయాలను కలచివేయవచ్చు)

AP News: పది రోజుల క్రితం పుట్టిన పసికందు పాలకోసం ఏడుస్తున్నాడు. పాలు పట్టాలని దీనంగా మొహం పెట్టాడు. బిడ్డకు పాలు పట్టాలని ఆ తల్లి ఎంత ప్రయత్నించినా వీలు కావడం లేదు. చేతులు, కాళ్లు పనిచేయడం లేదు. ఏం చేయాలో అర్థంకాక నరకయాతన పడుతున్న ఆమెకు ఒక్కసారిగా మెలకువ వచ్చింది.  ఇంతసేపు బిడ్డకోసం పడిన ఆవేదన కలలోనా..? అంటూ నిట్టూర్చింది ఆ తల్లి.  చనిపోయిన పసికందు బ్రతికే ఉన్నట్లు కలలో ఆమెకు కనిపించిందట. వెంటనే బంధువులతో కలిసి బిడ్డను పూడ్చిపెట్టిన సమాధి తవ్వి బయటకు తీశారు. కలలో చెప్పినట్లుగానే బాబుకు పాలు పట్టింది. విచిత్రంగా నోట్లోపోసిన పాలు కడుపులోకి వెళ్లిపోయాయి. దాంతో పసికందుకు బ్రతికే ఉన్నాడన్న అనుమానంతో వైద్యులతో పరీక్షలు చేయించారు. ఐతే బిడ్డ చనిపోయాడని.. బ్రతికే అవకాశం లేదని డాక్టర్లు తేల్చి చెప్పడంతో మళ్లీ విషాదంలో మునిగిపోయింది ఆ కుటుంబం.

ప్రకాశం జిల్లా దొనకొండ మండలం మంగినపూడికి చెందిన దంపతులకు పదిరోజుల క్రితం బాబు పుట్టాడు. పుట్టినరోజు నుంచే ఆ చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఒంగోలులోని రిమ్స్‌ వైద్యశాలలో చికిత్స అందించారు. వారం రోజుల తరువాత బిడ్డ చనిపోయాడని ఒంగోలు రిమ్స్ డాక్టర్లు చెప్పడంతో కన్నీటిపర్యంతమైన ఆ దంపతులు..సొంతూరికి తీసుకొచ్చి పూడ్చిపెట్టారు.  అదేరోజు రాత్రి తల్లికి ఓ కల వచ్చింది. పాలకోసం బాబు గుక్కపెట్టి ఏడుస్తున్నట్లు…అమ్మకోసం దీనంగా చూస్తున్నట్లు అనిపించింది. వెంటనే కలలో నుంచి మేల్కొన్న ఆమె ఈ విషయాన్ని భర్త, బంధువులకు చెప్పడంతో అంతా నిర్ఘాంతపోయారు. బాబు బతికే ఉంటాడన్న ఓ చిన్న ఆశ వారిలో చిగురించింది. వెంటనే సమాధిని తవ్వి బాబును వెలికితీశారు. పూడ్చిపెట్టిన సమయంలో బాబు ఎలా ఉన్నాడో రెండు రోజుల తరువాత కూడా అలాగే ఉన్నాడని అనిపించింది. ఐతే బాబు ప్రాణంతో లేడని వైద్యులు చెప్పడంతో శోకసంధ్రంలో మునిగిపోయారు. బాబు బతికున్నాడని వచ్చిన కలను నిజం చేసుకునేందుకు ఆ కన్నతల్లి పడిన ఆరాటం మాత్రం గ్రామంలో అందర్నీ కంటతడి పెట్టించింది.

Also Read: AP: పాముకు చేప నైవేద్యం.. మైకంలో కాలనాగుతో ముచ్చట్లు.. కట్ చేస్తే.. షాకింగ్ వీడియో