గ్యాస్ స్టౌవ్ వెలిగించడానికి లైటర్ సురక్షితమైన మార్గమని మనందరికీ తెలిసిందే. అయితే, చాలా మంది అగ్గిపుల్లతో గ్యాస్ వెలిగిస్తారు. కానీ అది ప్రమాదకరం కావచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ లైటర్‌ను ఉపయోగించమని సలహా ఇస్తుంటారు నిపుణులు. కానీ, కొన్నిసార్లు లైటర్ అకస్మాత్తుగా పనిచేయదు. అలాంటి సమయాల్లో ప్రజలు వెంటనే లైటర్‌ను చెత్త కుండీలో విసిరేస్తుంటారు. కానీ, కొన్నిసార్లు లైటర్ రిపేరు చేసుకోవచ్చునని మీకు తెలుసా..? కాబట్టి లైటర్ పాడైందని మీరు అనుకుంటే, దానిని వెంటనే విసిరి పారేసేమ ముందు ఈ క్రింది చిట్కాలను ప్రయత్నించండి. ఇది లైటర్‌ను తిరిగి యూజ్ చేసుకునేలా చేస్తుంది.
ఒక్కోసారి మన వంటింట్లోని లైటర్ చలి, తేమ కారణంగా సరిగా పనిచేయవు. అలాంటి సందర్భాలలో లైటర్‌ను ఎండలో, వేడి వస్తువుకు దగ్గర ఉంచండి. కానీ, లైటర్‌ను నేరుగా మంటపై వేడి చేయటం తప్పదు. ఇలా చేస్తే ఒక్కోసారి అది పూర్తిగా కాలిపోయే అవకాశం ఉంటుంది.
లైటర్ నిరంతర ఉపయోగిస్తుండటం వల్ల అప్పుడప్పుడు బాగా జిడ్డుగా, దుమ్ము దూళి పేరుకుపోతుంది. అలాంటప్పుడు కూడా లైటర్ సరిగా పనిచేయదు. అటువంటి పరిస్థితిలో, లైటర్‌ను ఒకసారి శుభ్రం చేయడం అవసరం. దీని కోసం ఇయర్‌బడ్‌లను ఉపయోగించి క్లీన్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే ప్రతి మూల నుండి లైటర్‌ను శుభ్రం చేయండి.
అలాగే, వంట చేసేటప్పుడు లైటర్ సురక్షితమైన స్థలం అంటే అది నీళ్లు, ఆయిల్, వంట మరకలు పడకుండా సరైన స్థలంలో ఉంచండి. ఇలా చేస్తే అది ఎక్కువ రోజుల పాటు మన్నిక ఉంటుంది. అలాగే పొడి గుడ్డతో ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి. దానికి నీళ్లు తగలకుండా చూసుకోండి. నీళ్లు తగిలితే లైటర్ త్వరగా పాడవుతుంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి…