ఈ గెక్కో సర్వైవింగ్ స్కిల్స్ తెలిస్తే బాబోయ్ అంటారు..

ప్రకృతిలో కొన్ని జీవులు తమను రక్షించుకునేందుకు అద్భుతమైన పద్ధతులను అభివృద్ధి చేసుకున్నాయి. అలాంటి వాటిలో గోల్డెన్ టైల్డ్ గెకో ప్రత్యేకం. ప్రమాద సమయంలో ఇది తోక నుంచి దుర్వాసన గల ద్రవాన్ని విడుదల చేసి శత్రువులను దూరం పెడుతుంది. పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారితే..

ఈ గెక్కో సర్వైవింగ్ స్కిల్స్ తెలిస్తే బాబోయ్ అంటారు..
Golden Tailed Gecko

Updated on: May 04, 2026 | 2:04 PM

ప్రకృతిలో కొన్ని జీవులు తమను రక్షించుకునేందుకు అద్భుతమైన పద్ధతులను అభివృద్ధి చేసుకున్నాయి. అలాంటి వాటిలో గోల్డెన్ టైల్డ్ గెకో ప్రత్యేకం. ప్రమాద సమయంలో ఇది తోక నుంచి దుర్వాసన గల ద్రవాన్ని విడుదల చేసి శత్రువులను దూరం పెడుతుంది. పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారితే, తన తోకను విడదీసి పారిపోతుంది. ఆ తరువాత ఆ తోక తిరిగి పెరగడం ఈ జీవి ప్రత్యేకతగా నిలుస్తోంది.

ప్రకృతి సృష్టిలో ప్రతి జీవి తనను తాను రక్షించుకునేందుకు ప్రత్యేకమైన మార్గాలను అలవాటు చేసుకుంటుంది. అలాంటి అద్భుత రక్షణ పద్ధతులతో ప్రసిద్ధి చెందిన జీవుల్లో ఒకటి గోల్డెన్ టైల్డ్ గెకో. ఈ గెకోకు రెండు ప్రధాన రక్షణ పద్ధతులు ఉన్నాయి. మొదటిగా, ప్రమాదాన్ని గుర్తించినప్పుడు ఇది తన తోక నుంచి చిక్కటి, దుర్వాసన గల ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఈ ద్రవం శత్రువులకు అసహ్యం కలిగించి, దాడి నుంచి వెనక్కి తగ్గేలా చేస్తుంది. కొన్ని జాతుల్లో ఈ ద్రవం కొంత దూరం వరకు వెళ్లే సామర్థ్యం ఉన్నప్పటికీ, ఇది ప్రధానంగా సమీప దూరంలోనే ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఇక రెండవ రక్షణ విధానం మరింత ఆసక్తికరం. ఒకవేళ శత్రువు గెకోను పట్టుకునే ప్రయత్నం చేస్తే, ఇది తన తోకను స్వయంగా శరీరం నుంచి విడదీసి వెంటనే తప్పించుకుంటుంది. ఈ ప్రక్రియను శాస్త్రీయంగా ‘ఆటోటమీ’ అంటారు. తోక విడిపోవడం గెకోకు శాశ్వత నష్టం కాదు. కొద్ది కాలంలోనే కొత్త తోక తిరిగి పెరుగుతుంది. ఈ పునరుత్పత్తి సామర్థ్యం, అలాగే దుర్వాసన ద్రవాన్ని విడుదల చేసే లక్షణం గోల్డెన్ టైల్డ్ గెకోను జంతు ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

విజయ్ పార్టీ విజయం గురించి నాని ఆసక్తికర ట్వీట్.. 

Follow Us