భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తింటున్నారా?
31 May 2026
Jyothi Gadda
పూర్వం నుండి భోజనం తిన్న తర్వాత స్వీట్ లేదా ఏదైనా తీపి పదార్థం తినడం ఒక ఆనవాయితీగా వస్తోంది. బెల్లంలో సుక్రోజ్ తక్కువగా ఉండి, శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
బెల్లంలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. భోజనం తర్వాత బెల్లం తినడం వల్ల జీర్ణక్రియ వేగవంతమై గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు.
బెల్లం శరీరంలోని జీర్ణ ఎంజైములను ఉత్తేజపరుస్తుంది. తిన్న ఆహారం త్వరగా, సులభంగా జీర్ణమవుతుంది. మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి శాశ్వత ఉపశమనం లభిస్తుంది.
బెల్లంలో ఐరన్, ఫోలేట్ గుణాలు శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మహిళల్లో వచ్చే రక్తహీనత సమస్యను తగ్గించడానికి భోజనం తర్వాత బెల్లం ముక్క తినడం ఒక చక్కని సహజ ఔషధం.
ఇది కాలేయం, ఊపిరితిత్తులు, పొట్టలోని హానికరమైన టాక్సిన్లను బయటకు పంపి, శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరుస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది.
ఇందులో ఉండే జింక్, సెలీనియం, విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది.
చక్కెరలాగా బెల్లం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అకస్మాత్తుగా పెంచదు. ఇందులోని పొటాషియం శరీరంలో మెటబాలిజం రేటును పెంచి, నీరు పేరుకుపోకుండా చూస్తుంది, ఇది బరువు అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బెల్లాన్ని పరిమితంగా తీసుకోవడం మంచిది. అయితే, మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారు మాత్రం బెల్లం తినే ముందు ఒకసారి తమ వైద్యుని సలహా తీసుకోవడం శ్రేయస్కరం.