Viral: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయగా.. కొద్దిసేపటికి డెలివరీ బాయ్ నుంచి మెసేజ్.. ఏంటని చూడగా..
ఓ వ్యక్తికి బాగా ఆకలేసింది. అనుకున్నదే తడవుగా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. డెలివరీ బాయ్ ఎప్పుడెప్పుడు ఇంటికి తీసుకొస్తాడా..

ఓ వ్యక్తికి బాగా ఆకలేసింది. అనుకున్నదే తడవుగా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. ఆ ఫుడ్ ఆర్డర్‌ను డెలివరీ బాయ్ ఎప్పుడెప్పుడు ఇంటికి తీసుకొస్తాడా అని ఎదురు చూశాడు. సీన్ కట్ చేస్తే.. కొద్దిసేపటికి సదరు వ్యక్తి ఫోన్ మ్రోగింది. డెలివరీ బాయ్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. అదేంటని చూడగా.. దెబ్బకు అతడి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ ఘటన యూకే చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. యూకేకు చెందిన లియామ్ అనే వ్యక్తి డెలివిరో(Deliveroo) అనే ఆన్‌లైన్ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. దాని కోసం ఎదురు చూస్తుండగా.. కొంత సమయం తర్వాత అతడి సెల్‌కి మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి. అది కూడా డెలివరీ బాయ్ నుంచి వస్తున్నాయి. ఏంటా అని చూడగా.. దెబ్బకు కంగుతిన్నాడు.
మొదటిగా ‘సారీ’ అని మెసేజ్ చేసిన ఆ డెలివరీ బాయ్.. ఆ తర్వాత ‘మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ చాలా రుచిగా ఉంది. నేను ఆ ఫుడ్ తినేశాను. కావాలంటే మీరు డెలివిరో కంపెనీకి ఫిర్యాదు చేసుకోండని’ మెసేజ్‌ల్లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ వాటిపై ఓ లుక్కేయండి.
Deliveroo driver has gone rogue this morning pic.twitter.com/sFNMUtNRrk
— Bags (@BodyBagnall) October 28, 2022
