Vastu Tips: ఈ వాస్తు టిప్స్‌ పాటించండి.. ఇంట్లో డబ్బు కొరతే ఉండదు.

|

Nov 30, 2023 | 7:55 PM

మరీ ముఖ్యంగా భారతీయులు వాస్తును ఎక్కువగా విశ్వసిస్తుంటారు. వాస్తు ఇంట్లో ఉండే వారి ఆరోగ్య పరిస్థితులపై మాత్రమే కాకుండా, ఆర్థిక స్థితిగతులపై కూడా ప్రభావం చూపుతుందని వాస్తు పండితులు చెబుతుంటారు. ఇంట్లో సానుకూల వాతావరణం పెరిగి, చేతిలో డబ్బులు నిలవాలంటే కచ్చితంగా కొన్ని వాస్తు చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ టిప్స్‌ ఏంటంటే..

Vastu Tips: ఈ వాస్తు టిప్స్‌ పాటించండి.. ఇంట్లో డబ్బు కొరతే ఉండదు.
Vastu Tips
Follow us on

ఇంటి వాస్తుకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా భారతీయులు వాస్తును ఎక్కువగా విశ్వసిస్తుంటారు. వాస్తు ఇంట్లో ఉండే వారి ఆరోగ్య పరిస్థితులపై మాత్రమే కాకుండా, ఆర్థిక స్థితిగతులపై కూడా ప్రభావం చూపుతుందని వాస్తు పండితులు చెబుతుంటారు. ఇంట్లో సానుకూల వాతావరణం పెరిగి, చేతిలో డబ్బులు నిలవాలంటే కచ్చితంగా కొన్ని వాస్తు చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ టిప్స్‌ ఏంటంటే..

* మనలో కొందరు కత్తులు లేదా ఇతర పదునైన ఆయుధాలు ఉండే చిత్రాలను ఇంట్లో అలంకరణకు ఉపయోగిస్తుంటారు. అయితే వీటివల్ల కుటంబ సభ్యుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుంది.

* ఇక ఇంటికి ఉత్తర గోడపై కుబేర యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. కుబేర యంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో సానుకూల వాతావరణం పెరిగి. డబ్బులు నిల్వ ఉంటాయని వాస్తు పండితులు సూచిస్తున్నారు.

* ఇంట్లో నిత్యం పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే రంగుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని వాస్తు పండితులు చెబుతున్నారు. పసుపు, నారింజ, ఎరుపు వంటి బ్రైట్ కలర్స్‌ను ఉపయోగించాలి. ఇలాంటి కలర్స్‌తో సానుకూల వాతావరణం పెరుగుతుంది.

* వాస్తు శాస్త్రం ప్రకారం నిత్యం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇల్లు శుభ్రంగా ఉంటేనే ఇంట్లోకి పాజిటివ్‌ ఎనర్జీ వస్తుందని సూచిస్తున్నారు.

* ఇంట్లో ప్రశాంతంగా ఉండాలంటే.. పువ్వులు, పండ్లు, పక్షులు, మొక్కలు ఉండే చిత్రాలను ఇంటి అలంకరణలో ఉపయోగించాలి. ఇలాంటి ఫొటోలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు వాస్తు శాస్త్రంలో పేర్కొన్న పలు అంశాల ఆధారంగా అందించని మాత్రమే. ఈ విషయాల్లో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..