
చేతినిండా డబ్బులు, చేసుకున్నంత పని. అయితే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు కొందరికీ మానసిక ప్రశాంతత ఉండదు. నిత్యం ఏదో తెలియని ఆందోళన వెంటాడుతుంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఉండవు. దీనికి ఇంట్లోని వాస్తు దోషాలే కారణమని నిపుణులు చెబుతుంటారు. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కారణంగా ఇలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వాస్తు శాస్త్రంలో పేర్కొన్న కొన్ని అంశాలను పాటిచడం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
* ఇంటి ప్రధాన ద్వారానికి వాస్తులో ఎంతో ప్రాధాన్యత ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఎక్కువగా ద్వారాలు ఉంటే సమస్యలు ఏర్పడుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంటి నిర్మాణ సమయంలోనే ఎక్కువ డోర్లు లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు.
* ఇక ఇంట్లోకి గాలి వెలుతురు దారాలంగా వచ్చేలా చూసుకోవాలి. ఇందుకోసం కిటికీలు పెద్దగా ఉండేలా సెట్ చేసుకోవాలి. కిటికీలో నుంచి గాలి, వెలుతురు ధారాళంగా వస్తే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఉదయం సూర్య కిరణాలు నేరుగా ఇంట్లోకి వచ్చేలా ఉండాలి. దీనివల్ల ఇంట్లో పాజిటిక్ ఎనర్జీ పెరుగుతుంది.
* గాలి, వెలుతురు బాగా వచ్చే ఇంట్లో ఉండే వారికి అనారోగ్య సమస్యల బారిన పడడం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు కాబట్టి తూర్పు దిశలో పెద్ద కిటికీని ఏర్పాటు చేసుకోవాలి.
* ఇక బెడ్ రూమ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. బెడ్ రూమ్ ఎట్టి పరిస్థితుల్లో మెట్ల కింద లేదా బీమ్ కింద ఉండకుండా చూసుకోవాలి. దీనివల్ల నిద్రలేమి సమస్యతో పాటు మానసిక సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.
* ఇంట్లో ఏర్పాటు చేసుకునే అద్దాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అద్దాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండకూడదని వాస్తు పండతులు సూచిస్తున్నారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..