Vastu Tips: ఇంట్లో బోర్‌ వేస్తున్నారా.? ఈ వాస్తు టిప్స్‌ పాటించండి..

|

May 16, 2024 | 2:42 PM

ఇంట్లో బోరు ఉత్తర దిశలో లేదా ఈశాన్య దిశలో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తరం, దక్షిణం కన్నా పల్లంగా ఉంటే ఇంటి యజమానికి మేలు చేస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇక బోరు ఇంటి నిర్మాణం కోసం చేపట్టే పిల్లర్‌లో పడకుండా చూసుకోవాలని అంటున్నారు. అలాగే బోరు పాయింట్ డోర్‌లో కూడా పడకుండా ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది...

Vastu Tips: ఇంట్లో బోర్‌ వేస్తున్నారా.? ఈ వాస్తు టిప్స్‌ పాటించండి..
Bore Well Vastu
Follow us on

ప్రస్తుతం ఇంటి నిర్మాణం చేపట్టే ప్రతీ ఒక్కరూ కచ్చితంగా ఇంట్లో బోర్‌ వేసుకుంటున్నారు. నల్లాలు అందుబాటులో ఉన్నా చాలా మంది బోర్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే బోరు విషయంలో కూడా వాస్తు నియమాలు పాటించాలని వాస్తు పండితులు చెబుతుంటారు. ఇంటి నిర్మాణానికి ఎలాగైతే వాస్తు నియమాలు పాటిస్తామో, బోరు వేసుకునే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇంతకీ బోరు వేసుకునే సమయంలో ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంట్లో బోరు ఉత్తర దిశలో లేదా ఈశాన్య దిశలో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తరం, దక్షిణం కన్నా పల్లంగా ఉంటే ఇంటి యజమానికి మేలు చేస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇక బోరు ఇంటి నిర్మాణం కోసం చేపట్టే పిల్లర్‌లో పడకుండా చూసుకోవాలని అంటున్నారు. అలాగే బోరు పాయింట్ డోర్‌లో కూడా పడకుండా ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈశాన్యం దిశలో బోరు లేదా నీటి సంపు ఉంటే ఇంట్లో ఉండే వారి ఆరోగ్యాలు బాగుంటాయని వాస్తు పండితులు చెబుతున్నారు.

ఇక ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమం, ఆగ్నేయం, నైరుతి, దక్షిణం దిశ్లో బోరు లేకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ దిశల్లో బోర్‌ పాయింట్ ఉంటే ప్రమాదకరమని చెబుతున్నారు. ఈ వాస్తు లోపం కారణంగా ఆకస్మిక మరణాలు, అనారోగ్యాలు, ఆపదలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇక ఇంట్లోని నీరు ఉత్తరం నుంచి బయటకు వెళితే అభివృద్ధి కలుగుతుందని వాస్తు చెబుతోంది. అలాగే బోర్‌వెల్‌ ఎట్టి పరిస్థితుల్లో స్థంభంకు ఎదురుగా ఉండకూడదు.

అలాగే ప్రహరీ గేటు ఎదురుగా బోర్‌ ఉండకూడదు. ఇంటి తలుపులకు ఎదురుగా కూడా బోర్‌ ఉండకూడదు. ఒకవేళ రెండు లేదా అంతకంటే ఎక్కువ సంపులు ఏర్పాటు చేసుకుంటే ఆ రెండింటిలో ఈశాన్యం దిశలో ఉన్న సంపు ఎక్కువ లోతు ఉండేలా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..